News April 13, 2025

అమెరికాలో మాదిరి రోడ్లు నిర్మిస్తాం: నితిన్ గడ్కరీ

image

వచ్చే రెండేళ్లలో రోడ్ల నిర్మాణాల కోసం రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రత్యేకించి ఈశాన్య భారతంలోని రహదారులను USAరోడ్ల మాదిరిగా అభివృద్ధి చేస్తామన్నారు. రెండేళ్లలో భారత్‌ని ప్రపంచంలోని అత్యున్నత మౌలిక సదుపాయాలు కలిగిన దేశంగా అభివృద్ది చేస్తామని మంత్రి పేర్కొన్నారు. 2014లో 91,287కి.మీ ఉన్న జాతీయ రహదారుల పొడవు ప్రస్తుతం 1,46,204 కి.మీకి పెరిగిందన్నారు.

Similar News

News April 15, 2025

ఇలా పొదుపు చేస్తే.. ఆర్థిక సమస్యలకు చెక్!

image

ఉద్యోగమైనా, వ్యాపారం అయినా పొదుపు చేయకపోతే అనుకోకుండా వచ్చే ఆర్థిక సమస్యలను ఎదుర్కోలేం. అందుకే నెలనెలా వచ్చే ఆదాయంలో 20 శాతం కచ్చితంగా పొదుపునకు కేటాయించాలి. మిగతా 80 శాతం డబ్బునే ఇతరత్రా ఖర్చులకు వాడాలి. అందులోనూ అనవసరమైన ఖర్చులున్నాయా? అని ప్రతినెలా చెక్ చేస్తూ వాటిని తగ్గించుకోవాలి. హంగులు, ఆర్భాటాలు, కోరికలు తగ్గించుకుంటే భవిష్యత్తులో ఆర్థికపరమైన సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు.

News April 15, 2025

ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తింటే వచ్చే అనర్థాలివే!

image

ప్రొటీన్‌‌ ఫుడ్ శరీరానికి మేలు చేసినా మోతాదుకు మించితే ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ప్రొటీన్ ఎక్కువైతే తీవ్రమైన దాహం కలిగి, ఫలితంగా తాగే నీటి వల్ల కిడ్నీలపై భారం పడుతుంది. అలాగే, నోటి దుర్వాసనకూ ప్రొటీన్‌లోని ఆమ్లాలు కారణమవుతాయి. మరోవైపు మలబద్ధకం సమస్య కూడా వేధిస్తుంది. అధిక ప్రొటీన్‌ వల్ల శరీరంలో వేడి పెరిగి ఒళ్లు నొప్పులొస్తాయి.
NOTE: కేజీ శరీరబరువుకు 0.8గ్రా. ప్రొటీన్ అవసరం.

News April 15, 2025

బైడెన్ వల్లే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం: ట్రంప్

image

అమెరికా మాజీ అధ్యక్షుడు జోబైడెన్ పాలనపై US అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. 2020 ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగి బైడెన్ అధ్యక్షుడు అవ్వడం వల్లే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైందన్నారు. ఈ యుద్ధానికి తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఆయా దేశాల్లో మరణాలు, విధ్వంసం ఆపడానికి శ్రద్ధగా పని చేస్తున్నట్లు వివరించారు. అలాగే, బైడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ యుద్ధం పట్ల వ్యవహరించిన తీరును ఆయన ఎండగట్టారు.

error: Content is protected !!