News October 9, 2025
రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తాం: ఆర్.కృష్ణయ్య

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంపై బీసీ నేత ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, బీసీల నోటికాడి ముద్దను లాగేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తొందరపాటు వల్లే తమకు అన్యాయం జరిగిందని విమర్శించారు. బీసీల సత్తా ఏంటో చూపిస్తామన్నారు. ఇవాళ సాయంత్రంలోగా ప్రభుత్వ స్పందన చూసి రేపటి నుంచి బంద్‌కు పిలుపునిస్తామని స్పష్టం చేశారు.
Similar News
News October 9, 2025
బీజేపీ అంతర్గత చర్చకు నాకు సంబంధం లేదు: బొంతు

TG: తనను బీజేపీ అభ్యర్థిగా <<17960394>>ప్రతిపాదించిన<<>> విషయంపై పీసీసీ ఉపాధ్యక్షుడు బొంతు రామ్మోహన్ స్పందించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేస్తానన్న మాటల్లో వాస్తవం లేదన్నారు. తన అభ్యర్థిత్వంపై కాషాయ పార్టీలో అంతర్గత చర్చకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘నేను కాంగ్రెస్‌లోనే ఉన్నా.. ఉంటాను కూడా. ఇక్కడ సంతృప్తిగా ఉన్నాను’ అని ప్రకటన విడుదల చేశారు.
News October 9, 2025
APPSC పరీక్షల ఫలితాలు విడుదల

AP: వివిధ డిపార్టుమెంటు పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఆయా పోస్టులకు ఎంపికైన వారి జాబితాలను కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచింది. అసిస్టెంటు ట్రైబల్ ఆఫీసర్, అసిస్టెంటు కెమిస్ట్ (గ్రౌండ్ వాటర్), లైబ్రేరియన్స్ (మెడికల్), ఫిషరీస్ డెవలప్మెంటు ఆఫీసర్ (ఫిషరీస్) పోస్టులకు ఎంపికైన వారి వివరాలను వెల్లడించింది. ఆ వివరాలను ఇక్కడ <
News October 9, 2025
బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు: మహేశ్ కుమార్

TG: స్థానిక ఎన్నికలపై TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన ప్రకటన చేశారు. BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. GO-9పై హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీనిపై కోర్టులో పోరాడతామని ఆయన చెప్పారు. దీంతో HCలో పోరాడడం, స్టేపై సుప్రీంకోర్టుకు వెళ్లడమే ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్. ఆ తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగనున్నాయి.