News April 25, 2024

చెత్తపన్ను రద్దు చేస్తాం: చంద్రబాబు

image

AP: తాము అధికారంలోకి రాగానే చెత్తపన్ను రద్దు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. ఆమదాలవలస ప్రజాగళంలో మాట్లాడిన ఆయన.. ‘ఉత్తరాంధ్రకు జగన్ ఏం చేశారు? నాగావళి, వంశధార ఇసుక విశాఖకు వెళ్తోంది. ప్రజలకు రూ.10 ఇచ్చి రూ.100 దోచుకున్నారు. దేశంలోనే ఎక్కువ అప్పులున్న రాష్ట్రం AP. అప్పులు ఎక్కువ ఉన్న రైతులు కూడా ఏపీలోనే ఉన్నారు. అధికారంలోకి రాగానే పంటల బీమా అమలు చేస్తాం’ అని ప్రకటించారు.

Similar News

News March 24, 2026

మార్చి 24: చరిత్రలో ఈరోజు

image

1603: బ్రిటిషు మహారాణి ఎలిజబెత్ మరణం
1775: కవి, వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులు జననం
1882: క్షయ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియా ట్యుబర్‌క్యులాసిస్‌ను రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు
1977: భారత ప్రధానిగా మొరార్జీ దేశాయ్ బాధ్యతలు (ఫొటోలో)
1984 : భారత హాకీ క్రీడాకారుడు ఆడ్రియన్ డిసౌజా జననం
1991: సినీ గేయ రచయిత చెరువు ఆంజనేయ శాస్త్రి మరణం
* ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం

News March 24, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 24, 2026

నాసిక్ దొంగ బాబా.. గర్భవతినీ వదల్లేదు

image

నాసిక్ (MH) దొంగ బాబా అశోక్ ఖారత్ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పూజలు చేస్తే ఆరోగ్యకరమైన పిల్లలు పుడతారని నమ్మించి ఒక గర్భవతిని దారుణంగా రేప్ చేశాడు. పెళ్లి కుదురుతుందని నమ్మబలికి మరో యువతిని లోబర్చుకున్నాడు. ఇప్పటికే అరెస్టైన ఈ దొంగ బాబాపై ఇప్పుడు మరిన్ని కేసులు నమోదయ్యాయి. అలాగే కిలో ₹100 దొరికే చింతపిక్కలను రత్నాలంటూ ఒక్కోదాన్ని ₹10,000కు అమ్మి భక్తుల వీక్నెస్‌తో ఆడుకున్నాడు.