News April 3, 2024
ఉగ్రదాడి సూత్రదారులందర్నీ పట్టుకుంటాం: పుతిన్

మాస్కోలో ఉగ్రదాడి ఘటనతో భారీ మూల్యం చెల్లించుకున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఈ వ్యవహారం వెనుక ఉన్న సూత్రధారులందర్నీ పట్టుకుంటామని చెప్పారు. దేశాన్ని విచ్చిన్నం చేసేలా ప్రజల్లో భయాందోళనలు, కలహాలు, ద్వేషాన్ని నాటేందుకు కొందరు యత్నించారని.. అటువంటి వాటిని అనుమతించకూడదని వ్యాఖ్యానించారు. కాగా ఇటీవల రాజధాని మాస్కోలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 140 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.
Similar News
News December 2, 2025
RR: ‘రెండో విడత నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి’

గ్రామపంచాయతీ రెండో విడత ఎన్నికలు అన్ని విధాలా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లా కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీసు ఉన్నతాధికారులతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఎలాంటి తప్పిదాలకు తావు ఇవ్వకుండా అధికారిని నడుచుకోవాలని ఆదేశించారు.
News December 2, 2025
టెన్త్ పరీక్షలు ఎప్పుడంటే?

TG: టెన్త్ పరీక్షలు 2026 మార్చి 16న నిర్వహించేందుకు SSC బోర్డు సిద్ధమైంది. మార్చి 13తో ఇంటర్ ఎగ్జామ్స్ ముగియనున్న నేపథ్యంలో వెంటనే వీటిని నిర్వహించేలా అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. మరోవైపు విద్యార్థులపై ఒత్తిడి పడకుండా ఒక్కో పేపర్కు మధ్య 1-2 రోజులు గ్యాప్ ఉండేలా ప్లాన్ చేశారు. ఒకవేళ MAR 16న పరీక్షలు మొదలైతే ఏప్రిల్ మొదటి వారంలో ముగియనున్నాయి. ఒకటి రెండు రోజుల్లో షెడ్యూల్ రానుంది.
News December 2, 2025
ప్రాణాలతో ఉండాలంటే దేశం నుంచి వెళ్లిపో: ట్రంప్

పదవి నుంచి దిగిపోయి, దేశం విడిచి వెళ్లిపోవాలని వెనిజుల అధ్యక్షుడు నికోలస్ మదురోకు US అధ్యక్షుడు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. అలా చేస్తే ఆయన్ను, సన్నిహితులను ప్రాణాలతో వదిలేస్తామని చెప్పారు. ఫోన్ సంభాషణ సందర్భంగా ట్రంప్ హెచ్చరించారని ‘మియామి హెరాల్డ్’ చెప్పింది. ఈ ప్రతిపాదనకు ఆయన ఒప్పుకోలేదని తెలిపింది. ‘సార్వభౌమాధికారం, స్వేచ్ఛతో కూడిన శాంతి కావాలి. బానిస శాంతి కాదు’ అని మదురో చెప్పడం గమనార్హం.


