News April 6, 2024
వెంటాడి మరీ హతమారుస్తాం: రాజ్నాథ్ సింగ్

దేశంలో ఎవరైనా ఉగ్రదాడులకు పాల్పడి పాకిస్థాన్లో తలదాచుకోవాలని ప్రయత్నిస్తే ఆ దేశంలోకి వెళ్లి మరీ హతమారుస్తామన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ‘పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలనే కోరుకుంటాం. కానీ ఎవరైనా భారత్లో ఉగ్రదాడులకు ప్రయత్నిస్తే సహించం’ అని తెలిపారు. కాగా 2020 నుంచి ఇప్పటివరకు పాక్లో 20 మందిని భారత ఏజెంట్లు చంపారన్న వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.
Similar News
News April 23, 2025
నిజామాబాద్లో రికార్డ్ టెంపరేచర్

TG: రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఎండ ప్రభావం తీవ్రంగా కనిపించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో 45°C కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం CH కొండూరు, మల్కాపూర్లో 45.3°C టెంపరేచర్ నమోదైంది. అధిక ఉష్ణోగ్రతలతో పాటు వేడిగాలుల వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారు.
News April 23, 2025
పహల్గామ్ దాడి.. ప్రభాస్ హీరోయిన్పై నెటిజన్ల ఫైర్

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రభాస్ ‘ఫౌజీ’లో హీరోయిన్ ఇమాన్విపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆమె పాక్కు చెందినవారని, ‘ఫౌజీ’ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏ ఒక్క పాకిస్థానీ కూడా IND మూవీస్లో నటించకూడదంటున్నారు. అటు ఉగ్రదాడికి, ఆమెను ముడిపెట్టడం ఏంటని మరికొందరు అంటున్నారు. కరాచీకి చెందిన ఇమాన్వి కుటుంబం ప్రస్తుతం USలో నివసిస్తోంది. ఆమె తండ్రి ఇక్బాల్ పాక్ మాజీ మిలటరీ అధికారి.
News April 23, 2025
కాసేపట్లో వర్షం

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొద్దిసేపట్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సంగారెడ్డి, జగిత్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అరగంటలో వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేశారు. అటు ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనూ కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షం పడటానికి అవకాశం ఉందని తెలిపారు. మీ ప్రాంతంలో వర్షం కురుస్తోందా?