News February 24, 2025
2028లో మేమే అధికారంలోకి వస్తాం: జగన్

AP: అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించినట్లు జగన్ తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు. తాను 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటానని జగన్ చెప్పారు. అసెంబ్లీకి వెళ్లకపోయినా ప్రజా సమస్యల కోసం పోరాడుతామని చెప్పారు. 2028 జమిలి ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఇచ్చిన ఇళ్లను వెనక్కితీసుకుంటే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు.
Similar News
News November 27, 2025
నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రమును కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. నామపత్రాల స్వీకరణకు చేసిన ఏర్పాట్లను గమనించి పలు సూచనలు చేశారు. హెల్ప్ డెస్క్ వీడియోగ్రఫీ పోలీస్ బందోబస్తు తదితర అంశాలను పరిశీలించారు.
News November 27, 2025
కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు

AP: దిత్వా తుఫాను ప్రభావంతో రేపు GNT, బాపట్ల, ప్రకాశం, NLR, ATP, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు APSDMA తెలిపింది. ‘శనివారం అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో అతిభారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఆదివారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సుంది’ అని పేర్కొంది.
News November 27, 2025
ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న సిటీ ఏదో తెలుసా?

ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన నగరంగా ఇండోనేషియాలోని జకార్తా నిలిచింది. అక్కడ 4.19 కోట్ల మంది నివసిస్తున్నారు. 3.66 కోట్లతో బంగ్లాదేశ్‌లోని ఢాకా రెండో స్థానంలో ఉంది. టోక్యో(జపాన్) 3.34 కోట్ల జనాభాతో మూడో స్థానం, 3 కోట్ల మందితో ఢిల్లీ నాలుగో స్థానంలో ఉన్నాయి. 2050 నాటికి ఢాకా ఈ లిస్టులో తొలి స్థానానికి చేరే అవకాశం ఉందని ప్రపంచ అర్బనైజేషన్ ప్రాస్పెక్ట్స్-2025 రిపోర్టులో ఐక్యరాజ్యసమితి తెలిపింది.


