News July 9, 2024
2026 నాటికి ‘భోగాపురం’ పూర్తి చేస్తాం: రామ్మోహన్ నాయుడు

AP: 2026 నాటికి భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులు పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. దీని నిర్మాణంపై చంద్రబాబు, పవన్ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. ‘విమానాశ్రయం పనులను గత ప్రభుత్వం జాప్యం చేసింది. మొత్తం 2,700 ఎకరాల్లో 500 ఎకరాలు కుదించేందుకు యత్నించింది. ప్రస్తుతం యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నాం. దేశంలోనే నంబర్‌వన్ ఎయిర్‌పోర్ట్‌గా తీర్చిదిద్దుతాం’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News March 23, 2026
బాక్సాఫీస్ షేక్: ₹700 కోట్ల దిశగా ‘ధురంధర్ 2’

రణవీర్ సింగ్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ చరిత్రను తిరగరాస్తోంది. కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹691.32 కోట్ల గ్రాస్ వసూలు చేసి గదర్ 2, సలార్ వంటి మూవీల రికార్డులను అధిగమించింది. శని, ఆదివారాల్లో వరుసగా ₹100 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు సాధించిన తొలి హిందీ సినిమాగా నిలిచింది. ఇండియాలో ఇప్పటివరకు ₹454.12 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. త్వరలోనే ₹700 కోట్ల (గ్రాస్) మార్కును దాటనుంది.
News March 23, 2026
ఖాళీ స్టేడియాల్లో PSL

పాక్ సూపర్ లీగ్ పతనం దిశగా సాగుతోంది. మెజార్టీ విదేశీ ఆటగాళ్లు IPL వైపు మొగ్గుచూపుతుండగా, భద్రతా కారణాలతో పలువురు అక్కడికి వెళ్లట్లేదు. ఈ క్రమంలో ఈసారి ప్రేక్షకులు లేకుండా కేవలం 2 వేదికల్లోనే మ్యాచ్‌లను నిర్వహిస్తున్నట్లు PCB ఛైర్మన్ నఖ్వీ వెల్లడించారు. పొదుపు చర్యల్లో భాగంగానే ఇలా చేస్తున్నట్లు తెలిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశంలో ఆర్థిక, ఇంధన సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే.
News March 23, 2026
యుద్ధంతో అమెరికాకు ₹7,520 కోట్ల నష్టం

పశ్చిమాసియాలోని అమెరికన్ మిలిటరీ బేస్‌లపై ఇరాన్ జరిపిన వైమానిక దాడుల వల్ల USకు ₹7,520 కోట్ల నష్టం వాటిల్లిందని BBC, CSIS నివేదిక వెల్లడించింది. యుద్ధం మొదలైన తొలి 2 వారాల్లోనే ఈ నష్టం జరిగినట్లు అంచనా. జోర్డాన్‌లోని థాడ్ రాడార్ వ్యవస్థ ధ్వంసం అవ్వడం వల్ల సుమారు ₹4,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు US డిఫెన్స్ సిస్టమ్స్‌ను ఛేదించి ఈ విధ్వంసం సృష్టించాయి.


