News March 26, 2025

SLBCని పూర్తి చేసి తీరుతాం: మంత్రి ఉత్తమ్

image

TG: SLBC ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఇప్పటివరకు టన్నెల్‌లో చిక్కుకుపోయిన ఇద్దరి మృతదేహాలను వెలికితీశామని అసెంబ్లీలో చెప్పారు. ‘ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేస్తాం. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు వద్ద పనులు ప్రారంభిస్తాం. కాళేశ్వరం డీపీఆర్, నిర్మాణానికి తేడా ఉంది. ఈ విషయంలో NDSA రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News October 27, 2025

7,993 ప్రభుత్వ స్కూళ్లలో జీరో అడ్మిషన్లు

image

2024-25 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా 7,993 ప్రభుత్వ స్కూళ్లలో జీరో అడ్మిషన్లు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క విద్యార్థి కూడా చేరని స్కూళ్లు అత్యధికంగా ప.బెంగాల్‌లో(3,812) ఉన్నాయి. తర్వాతి స్థానంలో తెలంగాణ(2,245) ఉంది. 2023-24తో పోలిస్తే జీరో అడ్మిషన్ పాఠశాలల సంఖ్య 4,961 తగ్గింది. సదరు పాఠశాలల్లో విద్యార్థుల్లేకున్నా WBలో 17,965 మంది, TGలో 1,016 మంది టీచర్లుండటం గమనార్హం.

News October 27, 2025

దక్షిణ మధ్య రైల్వేలో 61 ఉద్యోగాలు

image

దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ కోటాలో 61 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ITI, ఇంటర్ అర్హతగల అభ్యర్థులు NOV 24వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 -25ఏళ్ల మధ్య ఉండాలి. అంతర్జాతీయ క్రీడల్లో Jr, Sr విభాగాల్లో పతకాలు సాధించినవారు అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, మహిళలు, EWS, మైనార్టీలు రూ.250 చెల్లించాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, క్రీడల్లో ప్రావీణ్యత, విద్యార్హత ఆధారంగా ఎంపిక చేస్తారు.

News October 27, 2025

వ్యవసాయంలో కంచె పంటలతో లాభమేంటి?

image

వ్యవసాయంలో చీడపీడల ఉద్ధృతిని తగ్గించడంలో కంచె పంటలు కీలకంగా వ్యవహరిస్తాయి. పొలంలో ప్రధాన పంట చుట్టూ లేదా గట్ల వెంబడి వేసే పైర్లను కంచె పంటలు అంటారు. పురుగులు, తెగుళ్ల బీజాలు ఒక పొలం నుంచి మరొక పొలానికి రాకుండా ఇవి ఆకర్షించి అడ్డుకుంటాయి. కంచె పంటలు ప్రధాన పంటల కంటే ఎత్తు పెరిగేవిగా ఉండాలి. జొన్న, సజ్జ, మొక్కజొన్న పంటలు సాధారణంగా కంచె(రక్షక) పంటలుగా ఉపయోగపడతాయి.