News February 26, 2025

రెండు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తాం: ఉత్తమ్

image

TG: SLBC టన్నెల్ వద్ద సహాయక చర్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. SLBC పూడికలోకి వెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. రెండు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని వెల్లడించారు. సమగ్ర ప్రణాళికతో తాము ముందుకెళ్తున్నామని, గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి దెబ్బ తిన్న TBMను వేరు చేస్తామని పేర్కొన్నారు.

Similar News

News October 16, 2025

రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగాయి: మోదీ

image

AP: డ్రోన్ రంగంలో కర్నూలు దేశానికి గర్వకారణంగా మారనుందని ప్రధాని మోదీ అన్నారు. రాయలసీమలోని ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్లతో ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పారు. గతంలో కాంగ్రెస్ హయాంలో విద్యుత్ స్తంభాలు కూడా సరిగా ఉండేవి కాదని, ఇప్పుడు ప్రతి గ్రామానికి కరెంట్ సరఫరా ఉందని తెలిపారు. దేశాన్ని ముందుకు నడిపించే శక్తి ఏపీకి ఉందని కర్నూలు సభలో పేర్కొన్నారు.

News October 16, 2025

CSIR-IICTలో ఉద్యోగాలు

image

CSIR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ 7 సైంటిస్ట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి వయోపరిమితిలో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iict.res.in/

News October 16, 2025

మహిళలు రోజూ గుమ్మడి గింజలు తింటే?

image

గుమ్మడి గింజల్లో విటమిన్లు, ఫైబర్, ప్రొటీన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మహిళలు రోజూ 10 గుమ్మడి గింజలను తింటే టైప్-2 డయాబెటిస్, హైబీపీ, గర్భధారణ సమస్యలు, మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఎముకలు దృఢంగా అవుతాయి. కొలెస్ట్రాల్‌ అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. PCOS, థైరాయిడ్, ఊబకాయం లాంటి సమస్యలు తగ్గుతాయి.
#ShareIt