News November 22, 2024

సంక్రాంతి లోపు పనులు పూర్తి చేస్తాం: పవన్ కళ్యాణ్

image

AP: NREGS ద్వారా రూ.4,500 కోట్లతో 30వేల పనులు చేపట్టినట్లు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ తెలిపారు. సంక్రాంతి లోపు ఆ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ఉపాధి పథకం నిధుల మళ్లింపు, జాబ్‌ కార్డుల్లో అవకతవకలు జరిగాయని MLAలు సభ దృష్టికి తీసుకురాగా, వాటిపై విచారణ చేస్తామని పవన్ ప్రకటించారు. ఉపాధి హామీ కింద కాలువల్లో పూడిక, గుర్రపుడెక్క తొలగింపు, శ్మశానవాటికల ప్రహరీల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News December 6, 2025

ఖలీ భూమిపై దుండగుల కన్ను.. ఏం చేశాడంటే?

image

ఒంటిచేత్తో నలుగురిని ఎత్తిపడేసే బలం ఉన్న WWE స్టార్ రెజ్లర్ ది గ్రేట్ ఖలీ (దలీప్ సింగ్ రాణా) నిస్సహాయత వ్యక్తం చేశారు. హిమాచల్‌లోని పాంటా సాహిబ్‌లో కొందరు దుండగులు తన భూమిపైనే కన్నేశారని వాపోయారు. రెవెన్యూ అధికారుల అండతో వారు భూమిని ఆక్రమించడానికి యత్నించినట్లు ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. ఇంతటి బడా సెలబ్రిటీకే ఈ దుస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

News December 6, 2025

గవర్నర్‌కు గ్లోబల్ సమ్మిట్‌‌ ఆహ్వానం

image

TG: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రావలసిందిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. ఈమేరకు లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఆహ్వాన పత్రం అందించారు. CS రామకృష్ణారావు పాల్గొన్నారు. మరోవైపు మంత్రి అడ్లూరి హిమాచల్‌ప్రదేశ్, హరియాణా CMలు సుఖ్వీందర్ సింగ్ సుఖు, నాయబ్ సింగ్ సైనీలను కలిసి సమ్మిట్‌కు ఆహ్వానించారు.

News December 6, 2025

భారత్ టార్గెట్ ఎంతంటే?

image

భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో సౌతాఫ్రికా 270 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టులో ఓపెనర్ డీకాక్ సెంచరీ(106)తో అదరగొట్టారు. కెప్టెన్ బవుమా 48, బ్రెవిస్ 29, బ్రీట్జ్‌కే 24 రన్స్‌తో రాణించగా మిగతావారు విఫలమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్, ప్రసిద్ధ్ చెరో 4 వికెట్లతో చెలరేగారు. అర్ష్‌దీప్, జడేజా తలో వికెట్ పడగొట్టారు. భారత్ విజయానికి 271 రన్స్ అవసరం.