News July 28, 2024
మా శత్రువును సమూలంగా నాశనం చేస్తాం: ఉత్తర కొరియా

అధినేత కిమ్ జాంగ్ ఆదేశిస్తే శత్రువుల్ని తుడిచిపెట్టేస్తామని నార్త్ కొరియా సైన్యం తెలిపింది. దక్షిణ కొరియాతో యుద్ధానికి 71 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించింది. ‘అమెరికాలో ఎవరు గెలిచినా ఆ దేశంతో మా సంబంధాల్లో మార్పు ఉండదు. దక్షిణ కొరియా, US కలిసి అణుయుద్ధాన్ని తీసుకురావాలని చూస్తున్నాయి. మమ్మల్ని కవ్విస్తే పూర్తిగా నాశనం చేస్తాం’ అని సైన్యం ప్రకటించినట్లు KCNA వార్తాసంస్థ పేర్కొంది.
Similar News
News October 16, 2025
IPS ఆఫీసర్ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు

పంజాబ్లోని రోపార్ రేంజ్ DIG, 2009 బ్యాచ్ IPS హర్చరణ్ సింగ్ భుల్లర్ను CBI అరెస్ట్ చేసింది. ₹8లక్షలు లంచం తీసుకుంటూ ఆయన అధికారులకు పట్టుబడ్డారు. హర్చరణ్ ఇల్లు, ఆఫీసులో సోదాలు చేసి ₹5Cr నగదు, 1.5kgs జువెలరీ, 22 లగ్జరీ వాచ్లు, ఆడి, మెర్సిడెస్ కార్లు, గన్స్&పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. అతనితో పాటు మధ్యవర్తినీ అరెస్ట్ చేశారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. రేపు వారిని కోర్టులో హాజరుపరచనున్నారు.
News October 16, 2025
తాలిబన్లు మనకు శత్రువులా?

<<18023858>>అఫ్గానిస్థాన్<<>>లోని తాలిబన్లు నిరంతరం యుద్ధాల్లో ఉండటంతో వారు మనకూ శత్రువులేనా అని పలువురు అనుకుంటారు. మనకు, వారికి ఇప్పటివరకు విభేదాలు/శత్రుత్వం రాలేదు. 1999లో పాక్ లష్కరే తోయిబా ఉగ్రవాదులు నేపాల్-ఢిల్లీ IC 814 విమానాన్ని హైజాక్ చేశారు. దాన్ని అఫ్గాన్లో ల్యాండ్ చేశారు. తాలిబన్లకు చెడ్డపేరు వచ్చేందుకు ఆ ప్లాన్ చేశారు. కానీ తాలిబన్లు ఆ విమానానికి రక్షణగా ఉండటంతో పాటు ఎవరికీ అపాయం కలగకుండా చూశారు.
News October 16, 2025
‘ఎల్లమ్మ’ సినిమాలో హీరోగా దేవిశ్రీప్రసాద్?

‘బలగం’తో డైరెక్టర్గా మారిన కమెడియన్ వేణు ‘ఎల్లమ్మ’ పేరుతో ఓ మూవీ తీయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ నటించనున్నట్లు తాజాగా ఓ వార్త బయటకొచ్చింది. దీనిపై మూవీ టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. అంతకుముందు ఈ ప్రాజెక్టు నాని నుంచి నితిన్కు, తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ వద్దకు వెళ్లినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు DSP పేరు వినిపించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.