News April 4, 2024
వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం: CBN

AP: తాము అధికారంలోకి వచ్చాక కూడా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబు స్పష్టం చేశారు. ‘వాలంటీర్ల వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు. వారంతా వైసీపీకి పని చేయడం సరికాదు. ప్రజలకు సేవ చేయాలని వాలంటీర్లను కోరుతున్నా. ఎండలో సచివాలయానికి వెళ్లడం వల్ల ఒకరిద్దరు చనిపోయారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇచ్చే వీలుంది. కానీ జగన్ కావాలనే అలా చేయించలేదు’ అని చంద్రబాబు ఆరోపించారు.
Similar News
News January 19, 2026
భార్యాభర్తలకు ఒకే ITR.. బడ్జెట్లో ప్రకటన?

బడ్జెట్ 2026లో మ్యారీడ్ కపుల్ కోసం ఆప్షనల్ జాయింట్ టాక్సేషన్ విధానాన్ని తీసుకురావాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీని ప్రకారం భార్యాభర్తలను ఒకే ఆర్థిక యూనిట్గా పరిగణించి ఉమ్మడి ఆదాయంపై పన్ను లెక్కిస్తారు. ఈ విధానం వస్తే దంపతుల ఉమ్మడి పన్ను మినహాయింపు పరిమితి పెరుగుతుంది. విడివిడిగా కాకుండా ఒకే ITR ఫైల్ చేయొచ్చు. ఇది ముఖ్యంగా మధ్యతరగతి, సింగిల్ ఇన్కమ్ కుటుంబాలకు భారీ ఊరటనిస్తుంది.
News January 19, 2026
6 గంటలకుపైగా విజయ్ను విచారించిన సీబీఐ

కరూర్ తొక్కిసలాట ఘటనపై విజయ్ దళపతిని సీబీఐ రెండోసారి విచారించింది. సుమారు 6 గంటలకు పైగా అధికారులు ఆయనను ప్రశ్నించారు. ఈ నెల 12న విజయ్ మొదటిసారి అధికారుల ముందు హాజరయ్యారు. అప్పుడు దాదాపు 7 గంటలపాటు ప్రశ్నించారు. అయితే ఆరోజు ఆయనను సాక్షిగా ప్రశ్నించగా, ఇవాళ అనుమానితుడిగా ఇంటరాగేషన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో సీబీఐ తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది.
News January 19, 2026
డిజిటల్ మీడియా ఫిల్మ్ టెక్నాలజీకి ప్రోత్సాహం: CBN

AP: డిజిటల్ మీడియా, వర్చువల్ ప్రొడక్షన్, గేమింగ్, యానిమేషన్, ఫిల్మ్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్టు CM CBN పేర్కొన్నారు. జూరిచ్లో ‘ఈరోస్ ఇన్నోవేషన్’ ఛైర్మన్ కిషోర్ లుల్లా, ప్రతినిధులు CMతో భేటీ అయ్యారు. AI, జెన్ AI, డీప్ టెక్, డిజిటల్ కంటెంట్ ఎకానమీ రంగాల్లో పెట్టుబడులపై చర్చించారు. ఈరోస్ ఏఐ ఆధారిత ఫిల్మ్ సిటీ, ఏఐ క్రియేటివ్ టెక్ హబ్ తదితరాల గురించి వారు CBNకు వివరించారు.


