News February 24, 2025
ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటాం: పెద్దిరెడ్డి

AP: అసెంబ్లీలో వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడిని అడిగామని MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అయితే సానుకూల స్పందన రాలేదని చెప్పారు. ఈ విషయంపై కోర్టును కూడా ఆశ్రయించామన్నారు. ప్రతిపక్ష హోదా కల్పించకపోయినా క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఇవాళ సభకు హాజరైన YCP నేతలు గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News December 16, 2025
నేడు, రేపు స్కూళ్లకు సెలవు

TG: రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటైన స్కూళ్లలో ఇవాళ, రేపు సెలవు ఉండనుంది. ఓటు వేసేందుకు వీలుగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వనున్నారు. కాగా మూడో(తుది) విడతలో 4,158 సర్పంచ్, 36,434 వార్డు స్థానాలకు 394 సర్పంచ్, 7,916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది.
News December 16, 2025
ఇందిరమ్మ ఇళ్లకు మరో ₹5,000Cr.. త్వరలో ఖాతాల్లోకి!

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి నిధుల కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇటీవల హడ్కో నుంచి ₹5,000Cr లోన్ తీసుకుంది. క్యాబినెట్ ఆమోదించాక వాటిని లబ్ధిదారులకు జమ చేసే అవకాశముంది. GHMC, అర్బన్ ఏరియాల్లో టవర్ల పద్ధతిలో నిర్మించే ఇందిరమ్మ ఇళ్లకూ ఈ నిధులనే వినియోగించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం 1.48L ఇళ్ల పనులు జరుగుతున్నాయి. 2026 MAR నాటికి లక్ష గృహప్రవేశాలు చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యం.
News December 16, 2025
ఎలుకలతో పంటకు తీవ్ర నష్టం.. ఎలా నివారిద్దాం?

వ్యవసాయంలో చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాల తర్వాత ఎక్కువ నష్టం ఎలుకల వల్ల వాటిల్లుతోంది. విత్తన దశ నుంచి కోత, నిల్వ వరకు ఎలుకలు ఏదో రూపంలో పంటకు, ఉత్పత్తులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. అనేక చీడపీడల వ్యాప్తికి కారణమవుతున్నాయి. వరి, గోధుమ, చెరకు, మొక్కజొన్నకు వీటి ముప్పు చాలా ఎక్కువ. విషపు ఎర, ఇనుప తీగల ఉచ్చు, పొగపెట్టడం ద్వారా ఎలుకలను ఎలా నిర్మూలించాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


