News February 9, 2025
కులగణన రీసర్వే చేస్తే సహకరిస్తాం: కేటీఆర్

TG: కులగణన పూర్తిగా తప్పుల తడక, చిత్తు కాగితంతో సమానమని కేటీఆర్ విమర్శించారు. రీసర్వే చేసి సరైన లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. ఇందుకు తామూ చొరవ తీసుకుంటామని పేర్కొన్నారు. బీసీ ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం మాట్లాడారు. ఈ సర్వేలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చినవారే పాల్గొనాలని కాంగ్రెస్ తొలుత చెప్పినట్లు గుర్తుచేశారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు.
Similar News
News November 19, 2025
ఆసిఫాబాద్లో రేపు మినీ జాబ్ మేళా

ఈ నెల 20న పాత కలెక్టర్ కార్యాలయం జనకాపూర్లో ఉదయం 10.30 గంటలకు TASK TRAINING CENTRE ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News November 19, 2025
ఈవీల విక్రయాల్లో MG విండ్సర్ రికార్డ్

ఈవీ కార్ల అమ్మకాల్లో MG విండ్సర్ రికార్డులు బద్దలు కొడుతోంది. భారత్లో 400 రోజుల్లోనే 50వేల యూనిట్లు విక్రయించినట్లు సంస్థ తాజాగా ప్రకటించింది. నెలకు 3,800పైగా కార్ల చొప్పున విక్రయాలు జరిగినట్లు పేర్కొంది. భారతీయ మార్కెట్లో అత్యంత వేగంగా 50వేల మార్కును అందుకున్న ఫోర్ వీలర్ ఈవీగా నిలిచినట్లు వెల్లడించింది. బ్రిటన్కు చెందిన MG.. ఇండియాలో JSWతో జతకట్టి తమ కార్ల విక్రయాలు ప్రారంభించింది.
News November 19, 2025
సూసైడ్ బాంబర్ వీడియోలు తొలగించిన META

ఢిల్లీ ఎర్రకోట వద్ద ఆత్మాహుతికి పాల్పడిన సూసైడ్ బాంబర్ ఉమర్ సెల్ఫీ వీడియో SMలో వైరలైన విషయం తెలిసిందే. వాటిని META సంస్థ తమ ప్లాట్ ఫామ్స్ నుంచి తొలగించింది. తమ యూజర్ గైడ్ లైన్స్కు విరుద్ధంగా ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ‘నాది ఆత్మహత్య కాదు.. <<18318092>>బలిదానం<<>>’ అని ఉమర్ ఆ వీడియోలో సమర్థించుకున్నాడు. అయితే ఈ వీడియో ట్విటర్లో అందుబాటులోనే ఉండటం గమనార్హం.


