News October 15, 2024
వచ్చే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం: టాటా గ్రూప్

సెమీ కండక్టర్, ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీల తయారీ రంగంలో వచ్చే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తెలిపారు. తయారీ రంగంలో జాబ్స్ క్రియేట్ చేయలేకపోతే అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న భారత్ లక్ష్యం నెరవేరదని అన్నారు. 100మిలియన్ల ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒక్కో మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్ వల్ల 8-10 ఇన్‌డైరెక్ట్ జాబ్స్ క్రియేట్ అవుతాయన్నారు.
Similar News
News February 1, 2026
కాటన్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు

గువాహటిలోని కాటన్ యూనివర్సిటీలో 9 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీ, డాక్యుమెంట్స్‌ను ఫిబ్రవరి 9 వరకు పోస్ట్ చేయాలి. దరఖాస్తు ఫీజు రూ.1000, SC,STలకు రూ.500. వెబ్‌సైట్: https://cottonuniversity.ac.in/
News February 1, 2026
40% GST.. భారీగా పెరిగిన ధరలు

పొగాకు ఉత్పత్తులపై విధించిన 40% జీఎస్టీ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఆ పన్నుతో పాటు అదనంగా ఎక్సైజ్ డ్యూటీ, హెల్త్ సెస్ విధించడంతో సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కాల ధరలు భారీగా పెరిగాయి. హానికర ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే మార్కెట్లో పొగాకు ఉత్పత్తుల ధరలు ఇప్పటికే పెంచి అమ్ముతున్నారు.
News February 1, 2026
నిర్మలమ్మ పద్దు.. ₹54 లక్షల కోట్లు?

2026-27 కేంద్ర బడ్జెట్ ₹54 లక్షల కోట్లుగా ఉండనున్నట్లు ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే 7.9 శాతం ఎక్కువని చెబుతున్నాయి. 2025-26లో కేంద్రం ₹50.65 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది. మరోవైపు జీతం తీసుకునే వ్యక్తులకు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి కనీసం రూ.15 వేల వరకు పెరగొచ్చని తెలుస్తోంది. ఈ మేరకు స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.75 వేల నుంచి 90 వేలకు పెంచే అవకాశం ఉందని సమాచారం.


