News December 24, 2024

ఆ నిర్మాణాలు కూల్చం: హైడ్రా కమిషనర్

image

TG: హైడ్రా ఏర్పాటుకు ముందు ఇచ్చిన అనుమతులన్నీ చెల్లుతాయని కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. హైడ్రా వచ్చాక జరుగుతున్న అక్రమ నిర్మాణాలనే కూల్చుతామన్నారు. FTLలో ప్రజలు నివాసం ఉంటున్న భవనాలను కూల్చబోమని ప్రకటించారు. కాలనీ సంఘాలు చేస్తున్న ఫిర్యాదులకు తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. హైడ్రా ఏర్పాటు తర్వాత ప్రజల్లో చైతన్యం పెరిగిందని, స్థలాలు కొనేవారు అన్నీ చెక్ చేసుకుంటున్నారని చెప్పారు.

Similar News

News January 8, 2026

నీరసంగా ఉందా? ఈ ఫుడ్స్ తినండి

image

నీరసంగా ఉన్నప్పుడు తక్షణశక్తి కోసం కొన్ని ఆహారాలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. గుడ్లు, గింజలు, చీజ్, లీన్ మీట్ వంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, కార్బోహైడ్రేట్లుండే పండ్లు, కూరగాయలు, రొట్టె, పాస్తా, అన్నం, నట్స్, ఫిష్, అవకాడో, బచ్చలికూర, కాయధాన్యాలు, రెడ్ మీట్, టోఫు వంటివి తీసుకోవడం వల్ల శక్తి లభిస్తుందని చెబుతున్నారు. ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్‌ ఫుడ్‌ లాంటివి తినకూడదని చెబుతున్నారు.

News January 8, 2026

రైల్వేలో ఉద్యోగాలు.. పరీక్షల తేదీల ప్రకటన

image

RRB 2025లో నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాలకు పరీక్ష తేదీలను ప్రకటించింది. అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు FEB 16 – 18 వరకు, టెక్నీషియన్ పోస్టులకు MARCH 5 – 9వరకు, పారా మెడికల్ పోస్టులకు మార్చి 10 – 12 వరకు , JE/DMS/CMA పోస్టులకు FEB 19 – 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. పరీక్షకు 10రోజుల ముందు సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు, 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులను వెబ్‌సైట్‌లో పెట్టనుంది.

News January 8, 2026

భారీ నష్టాలు.. 780 Pts పడిపోయిన సెన్సెక్స్

image

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 263 Pts కోల్పోయి 25,876 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 780 Pts నష్టంతో 84,180కి పడిపోయింది. FIIల అమ్మకాలు, రష్యా ఆయిల్‌పై ఆంక్షలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ట్రేడ్ వార్ భయాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సెన్సెక్స్‌లో 4 స్టాక్స్ మాత్రమే పాజిటివ్‌గా ట్రేడయ్యాయి. L&T షేర్లు 3.35%, TECHM 2.92%, TCS 2.74%, రిలయన్స్ 2.25% నష్టపోయాయి.