News November 8, 2024
మీడియా ద్వారా ప్రభుత్వాన్ని నిలదీస్తాం: జగన్

AP: 40% ఓట్లు వచ్చిన YCPని ప్రతిపక్షంగా గుర్తించడం లేదని YS జగన్ మండిపడ్డారు. అసెంబ్లీలో అధికార కూటమి, మరొక పక్షం YCP మాత్రమే ఉందని, అలాంటి తమ పార్టీని ప్రతిపక్షంగా గుర్తించకపోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసే తప్పులు, ప్రజా సమస్యలు వినిపిస్తామనే భయంతోనే ఆ గుర్తింపు ఇవ్వట్లేదని ఆరోపించారు. అసెంబ్లీ జరిగినన్ని రోజులు మీడియా ద్వారా ప్రతిరోజూ ప్రతిపక్షంగా ప్రశ్నలు అడుగుతూనే ఉంటామన్నారు.
Similar News
News November 28, 2025
HNK: నందనం గణేష్‌కు కర్మవీర్ చక్ర అవార్డులో బ్రాంజ్ మెడల్

హనుమకొండ జిల్లా ఐనవోలు నందనం గ్రామానికి చెందిన యువ ఆవిష్కర్త యాకర గణేష్ ప్రతిష్ఠాత్మక కర్మవీర్ చక్ర అవార్డ్స్‌లో బ్రాంజ్ మెడల్‌ను అందుకున్నారు. నవంబర్ 26న ఫరీదాబాద్‌లో యూ.ఎన్ భాగస్వామ్యంతో జరిగిన కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డు దక్కింది. సాంకేతిక ఆవిష్కరణలు, పౌర చైతన్యం ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు తెస్తున్నందుకు గణేష్‌ను సన్మానించారు.
News November 28, 2025
అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్: నారాయణ

AP: అమరావతిలో రైల్వేస్టేషన్, రైల్వే లైన్, స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు కోసమే మరో 16వేల ఎకరాలను సమీకరిస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఎయిర్పోర్ట్ లేనిదే రాజధాని అభివృద్ధి చెందదని.. అందుకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలని సీఎం నిర్ణయించారన్నారు. గతంలో స్పోర్ట్స్ సిటీకి 70 ఎకరాలు మాత్రమే కేటాయించగా ఇప్పుడు 2,500 ఎకరాలు ఇచ్చామని వివరించారు.
News November 28, 2025
డిసెంబర్ పెన్షన్లకు రూ.2,739 కోట్లు విడుదల

AP: సీఎం చంద్రబాబు డిసెంబర్ 1న ఏలూరు జిల్లా గోపాలపురంలో పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. DEC పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.2,738.71 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 63,25,999 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఈ నెలలో నూతనంగా 8,190 పెన్షన్లు మంజూరు చేశామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు పెన్షన్ల రూపంలో రూ.21,280 కోట్లు అందజేశామని వివరించారు.


