News November 9, 2024

తిరుమల మాదిరిగా శ్రీశైలాన్ని అభివృద్ధి చేస్తాం: సీఎం చంద్రబాబు

image

AP: తిరుమల మాదిరిగా శ్రీశైలాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉందన్నారు. శ్రీశైలం మాస్టర్ ప్లాన్ రూపకల్పన కోసం మంత్రులు పవన్ కళ్యాణ్, కందుల దుర్గేశ్, ఆనం, బీసీ.జనార్ధన్‌తో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సీ ప్లేన్ ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందని, విజయవాడ నుంచి శ్రీశైలానికి 40 నిమిషాల్లో వచ్చామని ప్రెస్‌మీట్‌లో చెప్పారు.

Similar News

News January 7, 2026

ఖమ్మం సీపీఐ సభకు CM రేవంత్

image

సీపీఐ శత వసంతాల ముగింపు వేడుకలకు ఖమ్మం వేదిక కానుంది. ఈనెల 18న స్థానిక ఎస్.ఆర్ & బీ.జీ.ఎన్.ఆర్ కళాశాల మైదానంలో జరగనున్న భారీ బహిరంగ సభకు CM రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ చారిత్రాత్మక సభలో సీఎం ప్రసంగించనున్నట్లు సీపీఐ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

News January 7, 2026

జనవరి 07: చరిత్రలో ఈరోజు

image

* 1935: కలకత్తాలో భారత జాతీయ సైన్సు అకాడమీని నెలకొల్పారు.
* 1938: నటి బి.సరోజాదేవి జననం
* 1950: సామాజిక సేవకురాలు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత శాంతా సిన్హా జననం
* 1967: బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ జననం (ఫోటోలో)
* 1979: బాలీవుడ్ నటి బిపాషా బసు పుట్టినరోజు
* 2008: జైపూర్ ఫుట్ (కృత్రిమ పాదం) సృష్టికర్త ప్రమోద్ కరణ్ సేథీ మరణం

News January 7, 2026

బాటిల్ మూత రంగుతో నీటిని గుర్తించవచ్చు!

image

మార్కెట్‌లో దొరికే వాటర్ బాటిల్ మూత రంగును బట్టి అందులోని నీటి రకాన్ని గుర్తించవచ్చు. నీలం రంగు మూత ఉంటే అది సహజ సిద్ధమైన మినరల్ వాటర్. తెలుపు రంగు ప్రాసెస్ చేసిన నీటిని, ఆకుపచ్చ రంగు ఫ్లేవర్డ్ నీటిని సూచిస్తాయి. బ్లాక్ కలర్ ఆల్కలైన్ వాటర్‌కు, రెడ్ ఎనర్జీ డ్రింక్స్‌కు సంకేతం. అయితే ఇది అన్ని కంపెనీలకు తప్పనిసరి నిబంధన కాదు. కొనేముందు లేబుల్ చెక్ చేయడం మంచిది.