News January 8, 2025
విశాఖ ఫిషింగ్ హార్బర్‌ను అభివృద్ధి చేస్తాం: మోదీ
AP: విశాఖ సముద్ర తీరం వందల ఏళ్లుగా ఎగుమతులు, దిగుమతుల్లో ప్రధాన పాత్ర పోషిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. స్థానిక ఫిషింగ్ హార్బర్‌ను మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. సముద్ర సంబంధిత అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకుంటామని, మత్స్యకారుల ఆదాయం పెరిగేలా నిబద్ధతతో పనిచేస్తున్నామని చెప్పారు. అటు చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో క్రిస్ సిటీ(కృష్ణపట్నం) భాగం అవుతుందని వెల్లడించారు.
Similar News
News January 9, 2025
ACB ఆఫీసుకు KTR.. విచారణ ప్రారంభం
TG: కేటీఆర్ కొద్దిసేపటి కిందటే బంజారాహిల్స్‌లోని ఏసీబీ ఆఫీసుకు చేరుకున్నారు. కేటీఆర్ లాయర్ రామచందర్‌రావు కూడా కార్యాలయంలోకి వెళ్లగా విచారణ జరిగే గది పక్కనే ఉన్న లైబ్రరీ రూం వరకే ఆయన్ను అనుమతించారు. బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగం, క్యాబినెట్ అనుమతి లేకుండా ఒప్పందాలు, ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులు తదితరాలపై కేటీఆర్‌ను ఏసీబీ ప్రశ్నించనున్నట్లు సమాచారం.
News January 9, 2025
Stock Markets: ఫార్మా, ఫైనాన్స్ షేర్లు డౌన్
బెంచ్‌మార్క్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సంకేతాలే అందాయి. Q3 results నిరాశాజనకంగా ఉంటాయన్న అంచనాతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగుతున్నారు. నిఫ్టీ 23,608 (-83), సెన్సెక్స్ 77,902 (-245) వద్ద ట్రేడవుతున్నాయి. fmcg, media షేర్లు జోరు ప్రదర్శిస్తున్నాయి. bank, ఫైనాన్స్, ఫార్మా, రియాల్టి షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. కొటక్, hul, bajaj auto, itc టాప్ గెయినర్స్.
News January 9, 2025
తిరుపతి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్
తిరుపతి తొక్కిసలాటలో గాయపడిన వారి పరిస్థితిపై స్విమ్స్ సూపరింటెండెంట్ రవి కుమార్ తాజాగా వివరాలు వెల్లడించారు. క్షతగాత్రులందరికీ చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ముగ్గురు మాత్రం మూడు రోజుల అబ్జర్వేషన్లో ఉండాలని తెలిపారు. రుయా ఆస్పత్రిలో ఉన్నవారిని స్విమ్స్‌కు తరలించగా, మొత్తం 13మంది అక్కడ చికిత్స పొందుతున్నారు. సీఎం చంద్రబాబు ఇక్కడికే వచ్చి క్షతగాత్రులను పరామర్శించనున్నారు.