News April 11, 2024

ఒక్కదెబ్బతో పేదరికం పోగొడతాం: రాహుల్

image

పేదరిక నిర్మూలనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే ఒక్కదెబ్బతో పేదరికాన్ని పోగొడతామన్నారు. కుటుంబానికి ఒకరు చొప్పున పేద మహిళలకు అకౌంట్లో ఏటా రూ.లక్ష వేస్తామని దీంతో పేదరికానికి గుడ్‌బై చెప్పొచ్చని రాహుల్ పేర్కొన్నారు. మహాలక్ష్మి పేరుతో ఈ స్కీమ్ గురించి మేనిఫెస్టోలోనూ కాంగ్రెస్ ప్రస్తావించింది. పాంచ్ న్యాయ్ సహా 25 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించింది.

Similar News

News January 24, 2026

Republic day Special: అరుణా అసఫ్‌ అలీ

image

అరుణా అసఫ్‌ అలీ గొప్ప దేశభక్తురాలు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు. కాంగ్రెస్‌ సోషలిస్ట్‌ పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు. ఉప్పు సత్యాగ్రహం సమయంలో జైలు శిక్ష అనుభవించారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించడంతో బ్రిటిష్‌ ప్రభుత్వం అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. 1942లో అజ్ఞాతంలో ఉంటూనే ఉద్యమాన్ని కొనసాగించారు. 1997లో మరణాంతరం ప్రభుత్వం ఆమెకు ‘భారతరత్న’ ప్రదానం చేసింది.

News January 24, 2026

ఢిల్లీ.. ఊపిరి పీల్చుకో!

image

దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు ఇవాళ కాస్త స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నారు. వర్షాలు, గాలి వేగం పెరగడంతో వాయు కాలుష్యం తగ్గి గాలి నాణ్యత కొద్దిగా మెరుగైంది. సగటున AQI 249 పాయింట్లుగా నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ఎయిర్ క్వాలిటీ క్షీణించడంతో కొన్ని నెలలుగా అక్కడి వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలతో పాటు మంచు కురుస్తోంది.

News January 24, 2026

ఉగ్ర కుట్ర భగ్నం.. 2.5 కిలోల RDX స్వాధీనం!

image

రిపబ్లిక్ డే లక్ష్యంగా ఉగ్రదాడి కుట్రను పంజాబ్ పోలీసులు భగ్నం చేశారు. హొషియార్‌పూర్‌లో నలుగురు బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI) టెర్రరిస్టులను అరెస్టు చేశారు. 2.5 కిలోల RDX, 2 పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. అమెరికాకు చెందిన హ్యాండ్లర్ల ద్వారా ఈ ముఠా ఆపరేట్ అవుతున్నట్లు పోలీసులు తెలిపారు. గణతంత్ర వేడుకల్లో దాడులకు ప్లాన్ చేశారన్న సమాచారంతో సోదాలు చేసినట్లు చెప్పారు.