News August 21, 2025

కలిసి వచ్చే పార్టీలతో ఉక్కుపై పోరాటం చేస్తాం: బొత్స

image

AP: రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని YCP నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. కూటమి నాయకుల వ్యక్తిగత స్వార్థం కనిపిస్తోందని, కేంద్ర ప్రభుత్వ సాయం తప్ప రైతులకు రాష్ట్ర సర్కారు ఇచ్చిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. విశాఖ ఉక్కుపై కలిసొచ్చే పార్టీలతో పోరాటం చేస్తామని తెలిపారు.

Similar News

News August 21, 2025

‘గో బ్యాక్ మార్వాడీ’ ఉద్యమం.. రేపు తెలంగాణ బంద్

image

TG: స్థానిక వ్యాపారులపై గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు దౌర్జన్యం చేస్తున్నారంటూ రేపు తెలంగాణ బంద్‌కు OU JAC పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దానికి జనగామ స్వర్ణకారులు, కొండమల్లేపల్లి (నల్గొండ) వ్యాపారులు మద్దతు ప్రకటించారు. నల్గొండలో రేపు మొబైల్ షాపులు బంద్ చేస్తున్నామని తెలిపారు. మరోవైపు తమపై విద్వేషపూరిత ప్రకటనలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మార్వాడీ వ్యాపారులు DGPకి ఫిర్యాదు చేశారు.

News August 21, 2025

వారికి రూ.15 లక్షల సాయం

image

ఉద్యోగి చనిపోతే కుటుంబానికి ఇచ్చే డెత్ రిలీఫ్ ఫండ్‌ను EPFO భారీగా పెంచింది. గతంలో గరిష్ఠంగా ₹8.8 లక్షలుగా ఉన్న ఈ సాయాన్ని తాజాగా ₹15 లక్షలకు చేర్చింది. 2025 APR 1 తర్వాత ఎవరైనా ఉద్యోగి చనిపోతే అతని కుటుంబానికి ఈ మొత్తం అందుతుంది. 2026 APR 1 నుంచి ఈ ఎక్స్‌గ్రేషియా ఏటా 5% పెరుగుతుందని EPFO వెల్లడించింది. అటు మైనర్లకు అందాల్సిన డబ్బును గార్డియన్ షిప్ సర్టిఫికెట్ లేకుండానే ఇకపై ఇవ్వనున్నారు.

News August 21, 2025

బైక్‌లకు టోల్ ఫీజు అని ప్రచారం.. కేంద్రం వివరణ

image

టోల్ ప్లాజాల వద్ద టూవీలర్లకు సైతం ఫీజు వసూలు చేస్తారనే వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై PIB FACTCHECK స్పందించింది. NHAI దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలలోని టోల్ ప్లాజాల్లో బైకర్ల నుంచి ఎలాంటి రుసుమును వసూలు చేయ‌ట్లేదని స్పష్టం చేసింది. ఇలాంటి ప్రతిపాదన కూడా లేదని, తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని కోరింది. 4 లేదా అంతకంటే ఎక్కువ చక్రాలు ఉన్న వాహనాలకే టోల్ ఉంటుందని తెలిపింది.