News September 21, 2024
కేటీఆర్‌పై పరువు నష్టం దావా వేస్తాం: మంత్రి పొంగులేటి

TG: అమృత్ టెండర్ల పంపిణీలో అవినీతి జరిగిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ <<14158364>>వ్యాఖ్యలపై<<>> పరువు నష్టం దావా వేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. రూ.8,888 కోట్ల టెండర్లు ఎవరు దక్కించుకున్నారో కేటీఆర్ చెప్పాలన్నారు. తెల్లారితే పోలింగ్ ఉండగా గత ప్రభుత్వమే ప్రత్యేక అనుమతులతో 3 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచి పీఎల్ఆర్, మేఘా, గజా కన్స్ట్రక్షన్స్కు కట్టబెట్టిందన్నారు.
Similar News
News October 26, 2025
చిన్నవయసులోనే వృద్ధాప్యమా?

వయసుతోపాటు వృద్ధాప్యం రావడం సహజమే కానీ చిన్నవయసులోనే ఈ లక్షణాలు కనిపించడం చాలామందిని ఇబ్బంది పెడుతోంది. దీనికి జెనెటిక్స్‌తో పాటు ఒత్తిడి, నిద్ర, ఆహారం, లైఫ్‌స్టైల్, అతినీలలోహిత కిరణాలు, కాలుష్యం కారణాలంటున్నారు నిపుణులు. పోషకాహారం తీసుకోవడం, తగినంత నిద్ర, ఒత్తిడి తగ్గించుకోవడంతో పాటు మీకు నప్పే ఫేస్‌వాష్, మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్, విటమిన్ C, నియాసినమైడ్ సీరమ్ వాడాలని సూచిస్తున్నారు.
News October 26, 2025
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు: CBN

AP: తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసినట్లు CM చంద్రబాబు తెలిపారు. ‘జిల్లాలకు అవసరమైన నిధులు అందుబాటులో ఉంచి, ప్రత్యేక అధికారులను నియమించాం. వర్షం తీవ్రతను, తుఫాన్ ప్రభావానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా ప్రజలకు పంపడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపడుతున్నాం. ప్రభావిత ప్రాంతాల ప్రజలను షెల్టర్లకు తరలించి అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించాను’ అని ట్వీట్ చేశారు.
News October 26, 2025
నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్లో ఉద్యోగాలు

నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ 3 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. వీటిలో సీనియర్ కన్సల్టెంట్, సెక్రటేరియల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి MBBS/BDS/BHMS/MD/MPH/MBA/ BSc నర్సింగ్, ఫిజియోథెరపితో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://devnetjobsindia.org


