News August 25, 2025
ఎంత ఒత్తిడి వచ్చినా పరిష్కారాన్ని కనుగొంటాం: మోదీ

US 50% టారిఫ్స్ ఎల్లుండి నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో <<17512695>>PM మోదీ<<>> పరోక్షంగా స్పందించారు. ‘ఎంత ఒత్తిడి వచ్చినా దానికి పరిష్కారాన్ని కనుగొంటాం. నేడు ప్రపంచంలో ఆర్థిక స్వార్థంతో రూపొందుతోన్న విధానాలను చూస్తున్నాం. అలాంటి చర్యలను భారత్ వ్యతిరేకిస్తుంది. ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తాం. చిన్న పారిశ్రామికవేత్తలు, రైతులకు నష్టం జరగనివ్వం’ అని అహ్మదాబాద్‌లో ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.
Similar News
News November 23, 2025
ఆదిలాబాద్ కాంగ్రెస్ కొత్త సారథి నేపథ్యమిదే

ADB కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా గుడిహత్నూర్ మండలానికి చెందిన నరేశ్ జాదవ్ నియమితులైన విషయం తెలిసిందే. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. AICC మెంబర్‌గా ఉన్న ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్ అసెంబ్లీ నుంచి బరిలో నిలవాలనుకున్నా టికెట్ ఇవ్వలేదు. అయినా పార్టీలోనే కొనసాగుతూ తనదైన ముద్ర వేసుకున్నారు. పార్టీ పట్ల ఆయనకున్న విధేయతతోనే అధ్యక్ష పదవి వచ్చింది.
News November 23, 2025
పాడి పశువులకు ఈ లక్షణాలతో ప్రాణాపాయం

పాలజ్వరం అధిక పాలిచ్చే ఆవులు, గేదెల్లో ఎక్కువగా వస్తుంది. వ్యాధి సోకిన పశువులు సరిగా మేత మేయవు. నెమరు వేయక, బెదురు చూపులతో చికాకుగా ఉండి, వణుకుతూ కదలలేని స్థితిలో ఉంటాయి. సరిగా నిలబడలేవు. పశువులు తమ తలను పొట్టకు ఆనించి S ఆకారంలో మగతగా పడుకోవడం పాలజ్వరం ప్రధాన లక్షణం. వ్యాధి తీవ్రమైతే శ్వాస, నాడి వేగం పూర్తిగా పడిపోయి పశువులు మరణించే అవకాశం ఉంది. ఈ వ్యాధి నివారణ సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News November 23, 2025
నేడు భారత్ బంద్

మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ నేడు మావోయిస్టు పార్టీ భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. అనారోగ్యంతో ఉన్న హిడ్మా చికిత్స కోసం విజయవాడకు వస్తే పోలీసులు పట్టుకుని కాల్చి చంపారని మండిపడింది. బంద్ నేపథ్యంలో AOBలో పోలీసులు అప్రమత్తమయ్యారు. విశాఖ నుంచి సీలేరు మీదుగా భద్రాచలం వరకు నడిచే బస్సులను రద్దు చేశారు. ఆదివారం కావడంతో మైదాన ప్రాంతాల్లో బంద్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు.


