News March 8, 2025
రాష్ట్రంలో కొత్త జిల్లా ఏర్పాటు చేస్తాం: CM

AP: మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లా చేస్తామని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. ఈ పట్టణం చుట్టూ 250కి పైగా గ్రామాలు ఉన్నాయని, వాటన్నింటికీ ఇదే పెద్ద పట్టణం అని ఓ యువతి చెప్పారు. దీనిపై స్పందించిన సీఎం.. ‘మార్కాపురాన్ని జిల్లా చేస్తానని ఎన్నికల్లోనే హామీ ఇచ్చాను. కచ్చితంగా మార్కాపురాన్ని జిల్లా కేంద్రం చేస్తాం. అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం’ అని సీఎం చెప్పారు.
Similar News
News April 4, 2026
పశ్చిమాసియా యుద్ధం.. నిర్మాణ రంగంపై భారం

పశ్చిమాసియా యుద్ధం దేశంలో నిర్మాణ రంగంపై పడింది. రంగులు, స్టీల్, సిమెంట్, టైల్స్, శానిటరీ వేర్ రేట్లు పెరిగాయి. పెట్రోలియం అనుబంధ ఉత్పత్తుల కొరతే దీనికి కారణం. బస్తా సిమెంట్ ధర ₹50 పెరగగా, స్టీల్ ధర టన్నుకు 18% పెరిగింది. ప్రొపేన్ గ్యాస్ సరఫరా తగ్గడంతో శానిటరీ వేర్ ధరలు 8-12% పెరిగినట్లు తెలుస్తోంది. ఇంధన కొరత సాకుతో రవాణా ఛార్జీల రూపంలో ఇటుక ధరలు కూడా ₹8 నుంచి ₹10-12కు పెంచినట్లు సమాచారం.
News April 4, 2026
నేవీ అమ్ములపొదిలోకి ‘అరిదమన్’

భారతీయ నౌకాదళంలోకి స్వదేశీ సాంకేతికతతో తయారైన అణు జలాంతర్గామి ‘అరిదమన్’ చేరింది. దీంతో నేవీ అమ్ములపొదిలోని న్యూక్లియర్ సబ్‌మెరైన్‌ల సంఖ్య మూడుకు పెరిగింది. ఇది INS అరిఘాట్, INS అరిహంత్‌తో పోలిస్తే అప్‌గ్రేడెడ్ వెర్షన్. ఈ జలాంతర్గామి 3,500 కిలోమీటర్ల రేంజ్‌కు వెళ్లే అణుసామర్థ్యం గల ఎనిమిది కే-4 మిసైళ్లను మోయగలదు. దీంతో పాటు 24 K-15 సాగరిక న్యూక్లియర్ మిసైల్స్‌ను కూడా మోసే సామర్థ్యం ఉంది.
News April 4, 2026
ఓడామని వదలొద్దు.. ప్రయత్నిస్తే విజయం తథ్యం

అనగననగ రాగమతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ!
తాత్పర్యం: సంగీతం రానివారైనా రాగాలను పదేపదే ఆలపిస్తూ ఉంటే కొన్నాళ్లకు వినసొంపుగా పాడగలుగుతారు. వేప ఆకులు చేదుగా ఉన్నా రోజూ తింటూ ఉంటే కొన్నాళ్లకు తియ్యగా అనిపిస్తాయి. ఏ రంగమైనా సాధనతో నైపుణ్యం పెరిగి రాణిస్తారు. తొలిసారి విఫలమైనా తుదకు విజయం సాధిస్తారు.


