News August 15, 2025
కృష్ణా, గోదావరి నదుల్లో వాటా సాధిస్తాం: రేవంత్

TG: కృష్ణా, గోదావరి నదుల్లో రాష్ట్ర వాటాను సాధించి తీరుతామని CM రేవంత్ పునరుద్ఘాటించారు. ‘ఒత్తిడికి లొంగేది లేదు. మన ప్రాంతానికి సాగునీరు అందిస్తాం. కాంగ్రెస్ పాలనలో నిర్మించిన శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయి. కానీ గత ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు కూలి గోదావరిలో కలిసింది. సెంటిమెంట్ల పేరిట చేస్తున్న కుట్రలను రైతులు తిప్పికొట్టాలి’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News August 15, 2025
SALUTE రాజు నాయక్..

TG: అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన కానిస్టేబుల్ రాజు నాయక్‌కు కేంద్రం శౌర్య పతకం ప్రకటించింది. 2023లో నార్సింగి ORR సమీపంలో దంపతులను హత్య చేసి పరారైన కరణ్‌ను ఆయన గాలించి పట్టుకున్నారు. ఆ టైంలో తన ఛాతీ, తలపై నిందితుడు కత్తితో దాడి చేశాడు. రక్తం కారుతున్నా రాజు అతణ్ని వదల్లేదు. తోటి పోలీసుల సాయంతో అరెస్ట్ చేశారు. 3 సర్జరీల తర్వాత కోలుకుని ప్రస్తుతం హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
News August 15, 2025
త్రివిక్రమ్, వెంకటేశ్ కాంబోలో కొత్త మూవీ

విక్టరీ వెంకటేశ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో కొత్త మూవీ ఫిక్స్ అయింది. ‘వెంకీ77’ వర్కింగ్ టైటిల్‌తో త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని వెంకటేశ్ Xలో వెల్లడించారు. ఇది చాలా స్పెషల్ అంటూ త్రివిక్రమ్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. వీరిద్దరి కాంబోలో ఇదే తొలి మూవీ కావడం విశేషం. ప్రొడ్యూసర్స్ నాగవంశీ, రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించనున్నారు.
News August 15, 2025
రేపు స్కూళ్లకు సెలవు

తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు రేపు సెలవు ఉండనుంది. కృష్ణాష్టమి సందర్భంగా ఇరు రాష్ట్రాల్లోని ప్రభుత్వ స్కూళ్లకు పబ్లిక్ హాలిడే ఉంది. దాదాపు అన్ని ప్రైవేట్ స్కూళ్లు కూడా సెలవు ప్రకటించాయి. ఇప్పటికే వర్షాల కారణంగా గత మూడ్రోజులుగా చాలా జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ఇచ్చారు. రేపు కృష్ణాష్టమి, ఎల్లుండి ఆదివారం కావడంతో తిరిగి సోమవారమే స్కూళ్లు తెరుచుకోనున్నాయి.