News July 27, 2024

భారత జట్టుకు మంచి ఆతిథ్యం ఇస్తాం: మాలిక్

image

ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు పాకిస్థాన్ రావాలని పాక్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ కోరారు. ‘దేశాల వివాదాల్ని క్రీడలతో ముడి పెట్టకూడదు. గత ఏడాది మా జట్టు భారత్‌కు వెళ్లింది. ఈసారి వారు వస్తే బాగుంటుంది. వారిలో చాలామంది పాకిస్థాన్‌లో ఆడలేదు. మేం చాలా చక్కటి ఆతిథ్యమిస్తాం’ అని పేర్కొన్నారు. అయితే, ఆ దేశ పర్యటనలో శ్రీలంక జట్టు ఏం ఎదుర్కొందో మరచిపోలేదంటూ భారత ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Similar News

News November 20, 2025

పెరిగిన చలి.. కోళ్ల సంరక్షణలో జాగ్రత్తలు(1/2)

image

ప్రస్తుతం రాత్రి వేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో కోళ్ల పెంపకందారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో కోళ్లఫామ్‌ల గదుల్లో తేమ ఎక్కువగా ఉండి శిలీంద్రాలు పెరిగే ఛాన్సుంది. దీని వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కోళ్లకు సోకి, అవి మరణించే ప్రమాదం ఉంటుంది. అందుకే కోళ్లకు వెచ్చదనం ఉండేలా షెడ్డు చుట్టూ పరదాలు అమర్చాలి. ఇదే సమయంలో గాలి ప్రసరణ షెడ్‌లోకి సరిగా ఉండేలా చూసుకోవాలి.

News November 20, 2025

రూ.50లక్షలతో తీస్తే రూ.60కోట్లు వచ్చాయి!

image

కంటెంట్ నచ్చితే ప్రేక్షకులు సినిమాను గెలిపిస్తారని గుజరాతీ ఫిల్మ్ ‘లాలో: కృష్ణ సదా సహాయతే’తో మరోసారి రుజువైంది. కేవలం రూ.50లక్షలతో తీసిన ఈ సినిమా తొలుత తడబడినా.. కథపై మౌత్ టాక్ పెరిగి ఇప్పటికే రూ.60కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ‘లాలో’ అనే రిక్షా డ్రైవర్ చుట్టూ ఈ కథ సాగుతుంది. ఈ చిత్రాన్ని అంకిత్ సఖియా తెరకెక్కించగా కరణ్ జోషి ప్రధాన పాత్రలో నటించారు. ఈచిత్రం గత నెల 10న థియేటర్లలో విడుదలైంది.

News November 20, 2025

ఆరేళ్ల వయసుకే NGO స్థాపించి..

image

మణిపూర్‌కు చెందిన లిసిప్రియా కంగుజాం 2011లో జన్మించింది. ఆరేళ్ళ వయసులో చైల్డ్‌ మూవ్‌మెంట్‌ అనే సంస్థను స్థాపించి, క్లైమేట్‌ చేంజ్‌‌పై పోరాటం మొదలుపెట్టింది. లిసిప్రియా 2019లో యునైటెడ్‌ నేషన్స్‌ క్లైమేట్‌ చేంజ్‌ కాన్ఫరెన్స్‌‌లో మాట్లాడి అందర్నీ ఆకర్షించింది. ఆమె పోరాటానికి గుర్తింపుగా 2019లో డాక్టర్‌ APJ అబ్దుల్‌ కలాం చిల్డ్రన్స్‌ అవార్డ్, 2020లో గ్లోబల్‌ చైల్డ్‌ ప్రొడిజీ అవార్డ్‌లు అందుకుంది.