News April 6, 2024
కచ్చతీవు ద్వీపం ఇస్తాం.. కానీ!: శ్రీలంక

కచ్చతీవు ద్వీపాన్ని భారత్‌కు అప్పగించే ఉద్దేశం తమకు లేదని శ్రీలంక మంత్రి దేవానంద అన్నారు. కన్యాకుమారి సమీపంలోని వాడ్జ్ బ్యాంక్ ప్రాంతాన్ని అప్పగిస్తే కచ్చతీవును ఇస్తామని చెప్పారు. కాగా.. వాడ్జ్ బ్యాంక్ ప్రాంతంలో విలువైన వనరులుండటంతోనే భారత్ దాన్ని స్వాధీనం చేసుకుందని ఆరోపించారు. ఈ ద్వీపాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు అప్పగించిందని ఇటీవల ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Similar News
News November 21, 2025
ప్రసార్‌భారతిలో 29 పోస్టులకు నోటిఫికేషన్

న్యూఢిల్లీలోని <
News November 21, 2025
షాకింగ్ రిపోర్ట్.. భారత్‌పై పాక్ గెలిచిందన్న US!

అమెరికా మరోసారి భారత్‌పై అసత్య ప్రచారాలకు పూనుకుంది. పహల్గామ్ అటాక్ తర్వాత IND చేసిన ‘ఆపరేషన్ సిందూర్’కు పాకిస్థాన్ దీటుగా బదులిచ్చిందంటూ US సెనేట్‌లో ఓ నివేదికను సమర్పించింది. 4 రోజుల పోరులో పాక్ మిలిటరీ సక్సెస్ అయ్యిందని పేర్కొంది. ఈ సంఘర్షణను <<18335987>>చైనా<<>> తనకు అనుకూలంగా మార్చుకుందని తెలిపింది. ఈ రిపోర్టుపై INC నేత జైరాం రమేశ్ మండిపడ్డారు. ఇది మోదీ ప్రభుత్వ దౌత్య వైఫల్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు.
News November 21, 2025
ఇలాంటి చెరకు తోటల్లో కోతలను ఆలస్యం చేయొద్దు

పురుగులు, తెగుళ్లు, నీటి ముంపు, నీటి ఎద్దడికి గురైన చెరకు తోటలను త్వరగా నరికి ఫ్యాక్టరీకి తరలించాలి లేదా బెల్లం తయారీకి వాడాలి. ఆలస్యం చేస్తే దిగుబడి, రస నాణ్యత తగ్గుతుంది. పూత పూసిన తోటలను ఆలస్యంగా నరికితే రస నాణ్యత తగ్గి, ఈ గడల చిగురు భాగంలో బెండు ఏర్పడి బరువు తగ్గుతుంది. కింద సగభాగం కణుపుల వరకు వేర్లు ఉండే చెరకు గడ రసంలో పంచదార శాతం గణనీయంగా తగ్గిపోతుంది. అందుకే ఈ గడలను ముందే నరికి తరలించాలి.


