News April 19, 2024

ఖరీఫ్ నుంచి వరికి రూ.500 బోనస్ ఇస్తాం: పొన్నం ప్రభాకర్

image

TG: ఆగస్టు 15లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు. వచ్చే ఖరీఫ్ సీజన్‌ నుంచి క్వింటా వరికి రూ.500 బోనస్ ఇస్తామని తెలిపారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు కూడా రాబోతున్నాయని చెప్పారు. హుస్నాబాద్‌లో మాట్లాడుతూ.. ‘ఒకట్రెండు రోజుల్లో కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిని అధిష్ఠానం ఎంపిక చేస్తుంది. ఆయనను మంచి మెజార్టీతో గెలిపించాలి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.

Similar News

News January 19, 2026

అసలేంటీ ‘ట్రేడ్ బజూకా’!

image

తమ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు 2023లో ‘ట్రేడ్ బజూకా’(బెదిరింపుల వ్యతిరేక సాధనం-ACI)ను EU అమల్లోకి తెచ్చింది. ఇతర దేశాల ఆర్థిక బెదిరింపులు, బలవంతపు వాణిజ్య పద్ధతుల నుంచి తమ రక్షణ కోసం రూపొందించింది. కౌంటర్ టారిఫ్స్, దిగుమతులపై ఆంక్షలు, యూరోపియన్ మార్కెట్లలోకి ఆయా దేశాల యాక్సెస్‌ను, పెట్టుబడులను నియంత్రించడం, కాంట్రాక్టుల్లో పాల్గొనకుండా బ్లాక్ చేయడం వంటి పవర్స్ దీనికి ఉంటాయి.

News January 19, 2026

ఐఐటీ ఢిల్లీలో పోస్టులు

image

<>IIT <<>>ఢిల్లీ 17 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు JAN 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PG, PhD (సైన్స్/ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్- 2కు నెలకు రూ.67K+HRA, ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ 3కి రూ.78K+HRA, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్‌కు రూ.28K చెల్లిస్తారు. సైట్: https://ird.iitd.ac.in

News January 19, 2026

నేటి నుంచి మాఘ మాసం

image

మాఘమాసం ఆధ్యాత్మిక, ఆరోగ్యపరంగా ఎంతో విశిష్టమైనది. చంద్రుడు మఖ నక్షత్రంలో ఉండటం వల్ల దీనికి మాఘం అనే పేరు వచ్చింది. ఈ నెలలో సూర్యోదయానికి ముందే నదీస్నానం ఆచరించి, సూర్యుడిని, విష్ణుమూర్తిని ఆరాధిస్తే పాపాలు తొలగి, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. అక్షరాభ్యాసం, వివాహం వంటి శుభకార్యాలకు ఇదెంతో అనువైన సమయం. ఈ మాసమంతా విష్ణుసహస్రనామ పారాయణ, దానధర్మాలు చేయడం వల్ల పుణ్యఫలాలు లభిస్తాయని నమ్ముతారు.