News March 16, 2024
లాయర్లకు రూ.7,000 స్టైఫండ్ ఇస్తాం: చంద్రబాబు
AP: టీడీపీ చీఫ్ చంద్రబాబు న్యాయవాదులపై హామీల వర్షం కురిపించారు. పార్టీ లీగల్ సెల్ వర్క్షాప్లో మాట్లాడుతూ.. ‘స్వాతంత్ర పోరాటం తరహాలో ఏపీకి ఉన్మాది పాలన నుంచి విముక్తి కల్పించేందుకు న్యాయవాదులు పోరాడాలి. అధికారంలోకి వచ్చాక న్యాయమిత్ర పేరుతో లాయర్లకు ప్రతి నెలా రూ.7వేల స్టైఫండ్ ఇస్తాం. అడ్వొకేట్ల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తాం. ఇళ్ల స్థలాలు ఇస్తాం’ అని వెల్లడించారు.
Similar News
News November 21, 2024
సెహ్వాగ్ కొడుకు డబుల్ సెంచరీ
IND మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తరహాలోనే కొడుకు ఆర్యవీర్ సెహ్వాగ్ అదరగొడుతున్నారు. కూచ్ బెహార్ ట్రోఫీలో భాగంగా మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ తరఫున అద్భుతమైన డబుల్ సెంచరీ చేశారు. 229 బంతుల్లోనే అజేయ ద్విశతకం బాదేశారు. ఇందులో 34 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్లో మేఘాలయ 260 పరుగులకు ఆలౌటైంది. ఆర్యవీర్ విజృంభణతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఢిల్లీ 468/2 స్కోర్ చేసింది.
News November 21, 2024
ఏంటీ.. అరటిపండు ఆర్ట్కు రూ.52 కోట్లా?
ఇది కూడా ఓ ఆర్టేనా? అనుకున్నవి కూడా రూ.కోట్ల ధరలు పలుకుతుంటాయి. తాజాగా న్యూయార్క్లో జరిగిన వేలంలో గోడకు టేపుతో అంటించిన ఓ కళాఖండాన్ని క్రిప్టోకరెన్సీ ఎంట్రపెన్యూర్ జస్టిన్ సన్ ఏకంగా $6.2 మిలియన్లకు(రూ.52కోట్లు) కొనుగోలు చేశారు. దీంతో అత్యంత ఖరీదైన అరటిపండుగా ఇది రికార్డులకెక్కింది. హాస్యనటుడు మౌరిజియో కాటెలాన్ దీనిని రూపొందించారు. అరటిపండు కుళ్లిపోతే ఎలా మార్చాలో కూడా ఆయన చెప్పారు.
News November 21, 2024
విద్యుత్ ఛార్జీలపై జగన్ మొసలి కన్నీరు: మంత్రి గొట్టిపాటి
AP: విద్యుత్ రంగం గురించి మాజీ CM జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. 9సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఆయన ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ చేసిన పాపాలే ప్రజలకు శాపాలుగా మారాయన్నారు. విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు మద్దతివ్వకుండా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.