News October 15, 2024
డిమాండ్లు నెరవేర్చకుంటే సమ్మెకు దిగుతాం: వైద్యమిత్ర

AP: తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ నెల 29 నుంచి సమ్మెకు దిగుతామని ఏపీ వైద్యమిత్ర కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ హెచ్చరించింది. 17 ఏళ్లుగా క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఎన్టీఆర్ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవోకు లేఖ రాసింది. పదోన్నతులు, మృతుల కుటుంబాలకు రూ.15లక్షలు, రిటైర్మెంట్ పొందిన వారికి రూ.10 లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలని డిమాండ్ చేసింది.
Similar News
News November 27, 2025
RECORD: వికెట్ కోల్పోకుండా 177 రన్స్

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కేరళ ఓపెనర్లు రోహన్ కున్నుమ్మల్, సంజూ శాంసన్ రికార్డు సృష్టించారు. ఒడిశాతో మ్యాచులో వికెట్ కోల్పోకుండా 177 రన్స్ చేశారు. రోహన్ 60 బంతుల్లో 10 సిక్సులు, 10 ఫోర్లతో 121*, సంజూ 41 బంతుల్లో 51* పరుగులు బాదారు. ఈ టోర్నీ హిస్టరీలో ఇదే అత్యధిక ఓపెనింగ్ పార్ట్నర్షిప్. ఈ మ్యాచులో తొలుత ఒడిశా 20 ఓవర్లలో 176/7 స్కోరు చేయగా, కేరళ 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
News November 27, 2025
ఫైబర్ ఎంత తీసుకోవాలంటే..

మన శరీరానికి పీచు తగిన మొత్తంలో అందితేనే ఆకలి, ట్రైగ్లిజరాయిడ్స్ అదుపులోకి వస్తాయి. తద్వారా బరువు తగ్గే అవకాశాలూ ఎక్కువ. దంపుడు బియ్యం, గోధుమ, జొన్న, సజ్జ రవ్వలు, ఓట్స్, రాజ్మా, శనగల నుంచి ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తికి రోజులో 25-48గ్రా. వరకూ పీచు కావాలి. ఎత్తు, బరువు, అనారోగ్య సమస్యలు, రోజువారీ ఆహారపు అలవాట్లను బట్టి ఎంత ఫైబర్ తీసుకోవాలనేది వైద్యులు సూచిస్తారు.
News November 27, 2025
ముంపును తట్టుకొని అధిక దిగుబడి అందించిన వరి రకాలు

ఇటీవల మెుంథా తుఫానుకు వేలాది ఎకరాల్లో వరి దెబ్బతింది. కానీ ఈ తీవ్ర తుఫాన్ను ఎదుర్కొని మంచి దిగుబడినిచ్చాయి R.G.L- 7034, M.T.U-1232 వరి రకాలు. తీవ్ర గాలులు, వరద ముంపు, అనంతర చీడపీడలను తట్టుకొని ఈ 2 వరి రకాలు ఆశించిన దిగుబడినిచ్చినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. తక్కువ ఎరువుల మోతాదుతో అధిక దిగుబడినిచ్చే ఈ వరి వంగడాల పూర్తి సమాచారం కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.


