News April 8, 2025
బహిరంగ సభకు అనుమతివ్వకుంటే కోర్టుకు వెళ్తాం: కేటీఆర్

TG: 25 ఏళ్లు పూర్తి చేసుకున్న రెండో తెలుగు పార్టీ BRS అని కేటీఆర్ అన్నారు. అందుకే వరంగల్‌లో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బహిరంగ సభకు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. ఈ సారి డిజిటల్ మెంబర్‌షిప్ ప్రవేశపెడుతున్నామని, అందుకోసం జిల్లా కార్యాలయాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా జిల్లాల్లో నెలకో కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Similar News
News April 17, 2025
నేటి నుంచి ‘భూభారతి’ రెవెన్యూ సదస్సులు

TG: ‘భూభారతి’ పైలెట్ ప్రాజెక్ట్‌కు ఎంపిక చేసిన 4 మండలాల్లో నేటి నుంచి రెవెన్యూ సదస్సులు జరగనున్నాయి. అక్కడ రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారులు దరఖాస్తులు స్వీకరించి, వాటిని పోర్టల్ ద్వారా పరిష్కరిస్తారు. అందులో పరిష్కారం కాకున్నా, పోర్టల్ పని చేయకపోయినా రాష్ట్రస్థాయిలో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. ఈ సదస్సులను మంత్రి పొంగులేటి ఇవాళ నారాయణపేట జిల్లా మద్దూరులో ప్రారంభించనున్నారు.
News April 17, 2025
ఫెయిలైన విద్యార్థులకు స్పెషల్ క్లాసులు

AP: రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో చదువుతూ ఇంటర్ ఫెయిలైన, తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి వేసవిలో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఈ తరగతులు నిర్వహిస్తారు. ఇందుకోసం కేజీబీవీ హాస్టళ్లను ఉపయోగించుకోవాలని భావించింది. కాగా ఆదర్శ పాఠశాలల్లో ఫస్టియర్‌లో 44%, సెకండ్ ఇయర్‌లో 18% శాతం మంది ఫెయిలయ్యారు.
News April 17, 2025
వేసవిలో ఈ జాగ్రత్తలతో చర్మం ఆరోగ్యవంతం!

వేసవిలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా సరిపడా నీళ్లు తాగాలి. దీంతో చర్మం పొడిబారకుండా ఉంటుంది. ఇంటి నుంచి బయటికి వెళ్లాల్సి వస్తే ఫేస్‌కి కచ్చితంగా సన్ స్క్రీన్ వాడాలి. అలాగని, మందంగా కోటింగ్ వేస్తే చర్మ రంధ్రాలు మూసుకుపోయి జిడ్డు పెరిగి పింపుల్స్ వస్తాయి. పెదాల సంరక్షణకు లిప్ బామ్‌లు వాడాలని సూచిస్తున్నారు.