News February 28, 2025

రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తాం: రేవంత్

image

TG: పదేళ్ల BRS పాలనలో వరంగల్‌కు ఏం చేశారని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ‘వరంగల్‌కు ఎయిర్‌పోర్టు కావాలని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడిని నేనే అడిగా. భూసేకరణను క్లియర్ చేసి ఎయిర్‌పోర్టు, రింగ్ రోడ్డు కావాలని ఢిల్లీలో నివేదికలు అందించాకే కదలిక వచ్చింది. ఢిల్లీకి ఇందుకే వెళ్తున్నాం. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నేనే సాధించా. రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తాం’ అని CM స్పష్టం చేశారు.

Similar News

News March 1, 2025

గుడ్ న్యూస్.. ప్రాక్టీస్ సెషన్లో రోహిత్ శర్మ

image

తొడ కండరాల గాయంతో బాధపడుతున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ప్రాక్టీస్‌లో ఎలాంటి తడబాటు లేకుండా ఏకంగా 95 మీటర్లకు పైగా సిక్సర్ బాదినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఎల్లుండి మ్యాచ్‌లో హిట్ మ్యాన్ ఆడరనే ప్రచారానికి తెరదించినట్లే కనిపిస్తోంది. న్యూజిలాండ్‌తో మ్యాచుకు రోహిత్ స్థానంలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

News March 1, 2025

నేను వైసీపీలోనే ఉంటాను: తోట త్రిమూర్తులు

image

AP: తాను జనసేన పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని YCP MLC తోట త్రిమూర్తులు ఖండించారు. ఇటీవల జనసేన నేత సామినేని ఉదయభాను, త్రిమూర్తులు ఓ ఆలయంలో కలుసుకోవడంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో తాను ఇప్పుడు వైసీపీలోనే ఉన్నానని, ఎప్పటికీ వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. జగన్ నాయకత్వంలోనే కొనసాగుతానని వెల్లడించారు.

News March 1, 2025

మిరాకిల్ జరిగితేనే..

image

వర్షం కారణంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ రద్దవ్వడంతో అఫ్గానిస్థాన్ సెమీస్ ఆశలు దాదాపు గల్లంతైనట్లే. పాయింట్ల పరంగా దక్షిణాఫ్రికా(3P)తో సమానంగా ఉండగా రేపటి మ్యాచులో ఇంగ్లండ్ చేతిలో SA భారీ తేడాతో ఓడితేనే అఫ్గాన్‌కు అవకాశాలు ఉంటాయి. సుమారు 200 పరుగుల తేడాతో ENG గెలవాల్సి ఉంది. ఒకవేళ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా SA నేరుగా సెమీస్ వెళ్లనుంది.

error: Content is protected !!