News October 24, 2024

రేపు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తాం: బండి

image

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా రేపు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రకటించారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, కాంగ్రెస్ దోపిడీకి, పేదల ఇళ్ల కూల్చివేతలకు తాము వ్యతిరేకమన్నారు. మూసీ ప్రాజెక్ట్ ఓ పెద్ద స్కామ్ అని బండి ఆరోపించారు. ఉద్యోగులకు సరిగ్గా జీతాలు ఇవ్వలేని ప్రభుత్వానికి మూసీ కోసం రూ.1.50 లక్షల కోట్లు ఎక్కడివని నిలదీశారు.

Similar News

News October 24, 2024

అందుకే రైల్వే ప్రాజెక్టుల ఆలస్యం: కిషన్‌రెడ్డి

image

రాష్ట్రాలు వాటా ఇవ్వకపోవడంతో కొన్ని రైల్వే ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దక్షిణ మధ్య రైల్వేలో 40 స్టేషన్లను ఆధునీకరిస్తామని ఆయన వెల్లడించారు. కాజీపేటలో రూ.680కోట్లతో తయారీ యూనిట్ రాబోతోందన్నారు. రాష్ట్రం నుంచి సహకారం లేకపోయినా రూ.650కోట్లతో MMTS పొడిగిస్తామన్నారు.

News October 24, 2024

గ్రూప్-1, గ్రూప్-2పై ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్ ఆరా

image

AP: ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ ఏఆర్ అనురాధ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఫైల్‌పై సంతకం చేశారు. అనంతరం పెండింగ్ లో ఉన్న నియామకాలపై బోర్డు సభ్యులు, అధికారులతో రివ్యూ చేశారు. గ్రూప్-1, గ్రూప్-2 సహా పలు పరీక్షలు, ఇంటర్వ్యూలపై ఆరా తీశారు. కొత్తగా ఇవ్వాల్సిన నోటిఫికేషన్లపై వీలైనంత త్వరగా నిర్ణయాలు తీసుకుంటామని అనురాధ తెలిపారు.

News October 24, 2024

వాంతులు, విరేచ‌నాల‌తో ఇద్ద‌రు మృతి.. మంత్రి కీలక ఆదేశాలు

image

AP: ప‌ల్నాడు(D) దాచేప‌ల్లిలో వాంతులు, విరేచ‌నాల‌తో ఇద్ద‌రు వ్య‌క్తుల మృతిపై మంత్రి నారాయ‌ణ స‌మీక్ష‌ నిర్వహించారు. వారి మృతికి నీరు క‌లుషితం కావ‌డమే కారణమా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. స్థానికంగా ఉన్న బోర్ల‌లో నీటిని విజ‌య‌వాడ ల్యాబ్‌కు ప‌రీక్ష‌ల‌కు పంపాల‌ని ఆదేశించారు. బోర్ల‌ను మూసివేసి వాట‌ర్ ట్యాంక‌ర్ల ద్వారా తాగునీరు స‌ర‌ఫ‌రా చేయాల‌ని సూచించారు. హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.