News April 1, 2025

అన్ని హామీలు అమలు చేస్తాం: మంత్రి పొన్నం

image

TG: ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను త్వరలోనే అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్‌లో సన్నబియ్యం పథకాన్ని ఆయన ప్రారంభించారు. రాజీవ్ యువ వికాసం పథకానికి నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కరవు వస్తుందని కొందరు మాట్లాడుతున్నారని, మానేరు ప్రాజెక్టులో గతేడాది కంటే ఇప్పుడే నీటి నిల్వలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అర్హులకు రేషన్ కార్డులు ఇస్తామని పేర్కొన్నారు.

Similar News

News April 2, 2025

కొడాలి నాని హెల్త్ UPDATE

image

AP: మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానికి హార్ట్ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆపరేషన్ కోసం ముంబై వెళ్లారు. అక్కడి ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ వైద్యులు ఆయనకు బైపాస్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న నాని కొద్దిరోజుల్లోనే డిశ్చార్జ్ కానున్నారు.

News April 2, 2025

సుంకాల ప్రభావం.. భారత్‌లో తగ్గనున్న బంగారం ధరలు!

image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించనున్న సుంకాలతో భారత్‌లో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. $11.88 బిలియన్ల విలువైన బంగారం, వెండి, వజ్రాలను భారత్ అమెరికాకు ఎగుమతి చేస్తుండగా వీటిపై ట్రంప్ 13.3% సుంకం విధించనున్నారు. దీని ప్రభావంతో భారత్‌లో నగలు, ఖరీదైన ఆభరణాలు చౌక కానున్నట్లు తెలుస్తోంది. కాగా, ఎలక్ట్రానిక్ పరికరాలపై సుంకం పెరగడంతో మొబైల్ ధరలు పెరిగే అవకాశం ఉంది.

News April 2, 2025

CMను కలిసిన నాగబాబు

image

AP: వెలగపూడి సచివాలయంలో CM చంద్రబాబును జనసేన MLC నాగబాబు భార్యతో సహా కలిశారు. MLCగా ప్రమాణ స్వీకారం అనంతరం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాగబాబును శాలువా కప్పి సీఎం సత్కరించారు. సీఎం, డిప్యూటీ సీఎం తనకు అవకాశం కల్పించి, అప్పజెప్పిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తానని నాగబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

error: Content is protected !!