News October 12, 2024
తల తాకట్టు పెట్టి అయినా పంట బీమా అమలు చేస్తాం: మంత్రి తుమ్మల

TG: రైతు భరోసాకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తల తాకట్టు పెట్టి అయినా పంట బీమా పథకం అమలు చేస్తామని చెప్పారు. అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో మెగా పవర్ ప్లాంట్ను ఆయన సహచర మంత్రులతో కలిసి ప్రారంభించారు. పామాయిల్ పంటకు టన్నుకు రూ.20వేల ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. భూమి ఉన్న ప్రతి ఒక్కరికి పామాయిల్ మొక్క అందేలా చూస్తామని తెలిపారు.
Similar News
News December 23, 2025
త్వరలో 22వేల గ్రూప్-D పోస్టులకు నోటిఫికేషన్

RRB త్వరలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జోన్లలో కలిపి 22 వేల గ్రూప్-D పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. టెన్త్, ఐటీఐ అర్హత గల అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. జనవరి 21 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థుల వయసు 18-33ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంటుంది. నెలకు జీతం రూ. 18,000 చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.rrbapply.gov.in
News December 23, 2025
అడిషనల్ సొలిసిటర్ జనరల్గా కనకమేడల

సుప్రీంకోర్టులో మరో ఇద్దరు అడిషనల్ సొలిసిటర్ జనరల్స్ను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది. ఇందులో మాజీ ఎంపీ, అడ్వకేట్ కనకమేడల రవీంద్రకుమార్, దవీందర్పాల్ సింగ్కు చోటు కల్పించింది. వీరు మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. కాగా రవీంద్ర కుమార్ 2018 నుంచి 2024 వరకు టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.
News December 23, 2025
ఎంపీ, ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకుంటున్నారు: కేంద్ర మంత్రి

ప్రతి MP, MLA అభివృద్ధి నిధుల్లో కమీషన్ తీసుకుంటున్నారని కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాఝీ వ్యాఖ్యానించారు. ‘నేను కూడా కమీషన్ తీసుకున్నాను. దాన్ని పార్టీకి ఇచ్చేవాడిని. మీరు కనీసం 5% కమీషన్ అయినా తీసుకోవాలి’ అని HAM(S) పార్టీ మీటింగ్లో నేతలకు సూచించారు. MPకి ₹5CR వరకు అభివృద్ధి నిధి ఉంటుందని, 10% కమీషన్ తీసుకున్నా ₹40 లక్షలకు పైనే వస్తుందని అన్నారు. కాగా మంత్రి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.


