News December 12, 2024

ఏపీని నం.1గా నిలబెడతాం: సీఎం చంద్రబాబు

image

స్వర్ణాంధ్ర-2047 విజన్‌తో రాష్ట్రాన్ని నం.1గా నిలబెడతామని CM చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయిన సందర్భంగా ట్వీట్ చేశారు. మెగా DSC, కానిస్టేబుల్ తదితర ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నామని, పలు కంపెనీల నుంచి భారీ పెట్టుబడులు రాబట్టినట్లు చెప్పారు. దీపం-2 పథకం, పెన్షన్ల పెంపు వంటి హామీలను నెరవేర్చామన్నారు. కూటమి ప్రభుత్వ పాలనపై మీ కామెంట్?

Similar News

News January 22, 2026

భారత ప్లేయర్‌కు గాయం

image

న్యూజిలాండ్‌తో జరుగుతోన్న తొలి టీ20లో టీమ్ ఇండియా స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయపడ్డారు. 16వ ఓవర్లో మిచెల్ కొట్టిన బంతిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆయన వేలికి గాయమైంది. చేతి నుంచి రక్తం రావడంతో నొప్పితో మైదానాన్ని వీడారు. గాయం తీవ్రత ఎక్కువైతే తర్వాతి మ్యాచుల్లో అక్షర్ ఆడేది అనుమానమే.

News January 21, 2026

నాకు ఆ చిన్న ఐస్ ముక్క చాలు.. గ్రీన్‌లాండ్‌పై ట్రంప్

image

దావోస్‌ వేదికగా నాటో దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ‘నేను కేవలం ఒక ఐస్ ముక్క మాత్రమే అడుగుతున్నాను. ఇందుకు నో అనేవారిని అస్సలు మర్చిపోను’ అని హెచ్చరించారు. గ్రీన్‌లాండ్‌ను దక్కించుకోవడానికి ఫోర్స్‌ను కూడా ఉపయోగించనంటూ పరోక్ష బెదిరింపులకు దిగారు. ఆ ప్రాంతాన్ని కాపాడడం తమకే సాధ్యమని, ఇంకెవరూ ఆ పని చేయలేరని చెప్పుకొచ్చారు.

News January 21, 2026

SONY ఠీవీ.. ఇక ఇంటికి రాదా?

image

TV బ్రాండ్ అనగానే విన్పించే SONY సంస్థ TCLతో ఒప్పందం చేసుకుంది. దీంతో ఇకపై సోనీ బ్రాండ్ టీవీలు మార్కెట్లోకి రావా? అనే సందేహం నెలకొంది. అయితే SONY, BRAVIA పేర్లతోనే TCL టెలివిజన్ సెట్స్ తయారు చేయనుంది. భాగస్వామ్యంలో కొత్తగా ఏర్పాటయ్యే కంపెనీలో జపాన్ దిగ్గజానికి 49% వాటా, చైనా ప్రభుత్వం భాగస్వామిగా గల TCLకు 51% షేర్ ఉంటాయి. అయితే ప్రొడక్షన్ మారడంతో క్వాలిటీ తదితరాలు ఎలా ఉంటాయో వేచిచూడాలి.