News April 14, 2025
‘నిన్ను ఇంట్లోనే చంపుతాం’.. సల్మాన్ ఖాన్కు బెదిరింపులు

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్కు మరోసారి తీవ్ర బెదిరింపులు వచ్చాయి. ‘సల్మాన్.. నిన్ను ఇంట్లోనే చంపుతాం లేదా నీ కారుని బాంబు పెట్టి పేల్చేస్తాం’ అని వాట్సాప్ మేసేజ్ వచ్చింది. ఈ నంబర్ ముంబై వర్లీలోని రవాణా శాఖ పేరు మీద ఉంది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. కాగా గతంలో సల్మాన్ ఖాన్ను చంపుతామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే.
Similar News
News April 15, 2025
UPDATE.. కింగ్డమ్ డబ్బింగ్ స్టార్ట్

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కింగ్డమ్’ మూవీ డబ్బింగ్ ప్రారంభమైనట్లు హీరో విజయ్ దేవరకొండ ఇన్స్టా స్టోరీలో తెలిపారు. ఇప్పటికే సగం పార్ట్ పూర్తయిందని వెల్లడించారు. విజయ్ స్టోరీని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. మే 30న సినిమాను విడుదల చేసేందుకు దర్శకుడు-హీరో సిద్ధమయ్యారని రాసుకొచ్చింది.
News April 15, 2025
రేపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ పేర్లను చేర్చినందుకు నిరసనగా రేపు దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈడీ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించాలని పార్టీ నేతలకు సూచించింది. ఈమేరకు అన్ని రాష్ట్రాల పీసీసీలకు లేఖ రాసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలందరూ వీటిలో పాల్గొనాలని పేర్కొంది.
News April 15, 2025
విద్యార్థులకు గుడ్ న్యూస్.. గడువు పొడిగింపు

AP: పాలిసెట్ దరఖాస్తుల గడువును సాంకేతిక విద్యాశాఖ పొడిగించింది. ఈ నెల 17 వరకు <