News March 30, 2025

హైదరాబాద్ నుంచి వెళ్లిపోతాం: SRH ఆవేదన

image

ఉచిత పాస్‌ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తమను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోందని SRH ప్రతినిధి HCA కోశాధికారికి లేఖ రాశారు. కోరినన్ని పాస్‌లు ఇవ్వనందుకు ఇటీవల కార్పొరేట్ బాక్స్‌కు తాళాలు వేసినట్లు పేర్కొన్నారు. టికెట్ల విషయంలో HCA అధ్యక్షుడు జగన్మోహనరావు పలుమార్లు బెదిరించారని, ఇలాగే కొనసాగితే హైదరాబాద్ వదిలి వెళ్లిపోతామని హెచ్చరించడం సంచలనంగా మారింది. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఆయన కోరారు.

Similar News

News January 23, 2026

వసంత పంచమి వేడుకలు ఎలా చేసుకోవాలంటే..

image

వసంత పంచమి వేడుకల్లో పసుపు రంగుకు ప్రాధాన్యం ఎక్కువ. ప్రజలు తెల్లవారునే లేచి, పసుపు రంగు దుస్తులు ధరించి సరస్వతీ పూజ చేస్తారు. పసుపు రంగు మిఠాయిలను నైవేద్యంగా పెట్టి పంచుకుంటారు. కొందరు శివపార్వతులను పూజిస్తారు. మరికొందరు సూర్య నమస్కారాలు చేస్తారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి విందులు ఆరగిస్తూ, పాటలతో, నృత్యాలతో ఈ వసంత ఆగమనాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.

News January 23, 2026

వసంత పంచమి పూజా విధానం

image

పూజా మందిరాన్ని శుభ్రపరిచి పీటపై తెల్లని వస్త్రాన్ని పరవాలి. దానిపై సరస్వతీ దేవి చిత్రపటాన్ని ఉంచి గంధం, కుంకుమతో అలంకరించాలి. 9 వత్తుల దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించడం శుభప్రదం. మల్లెలు, జాజి పూలతో అర్చన చేస్తూ సరస్వతి అష్టోత్తర శతనామాలు పఠించాలి. పాలు, పటిక బెల్లం, పాయసాన్ని నైవేద్యంగా పెట్టి హారతి ఇవ్వాలి. పూజానంతరం ప్రసాదాన్ని పిల్లలకు పంచడం ద్వారా విద్యా బుద్ధులు కలుగుతాయని పెద్దలు చెబుతారు.

News January 23, 2026

కరాచీ ప్రమాదంలో 67కు చేరిన మృతుల సంఖ్య

image

పాకిస్థాన్‌ కరాచీలోని ‘గుల్ షాపింగ్ ప్లాజా’లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 67కు చేరింది. శిథిలాల నుంచి పదుల సంఖ్యలో మృతదేహాలను వెలికితీశారు. దుబాయ్ క్రాకరీ అనే షాప్‌లో ఒకేచోట 30 మృతదేహాలు లభ్యమయ్యాయి. మంటల నుంచి తప్పించుకోవడానికి షాప్ లోపల దాక్కోగా.. ఊపిరి ఆడక చనిపోయారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మృతుల్లో 12 మందిని మాత్రమే గుర్తించారు.