News July 4, 2024

కేంద్రంతో మంచి సంబంధాలు కొనసాగిస్తాం: సీఎం

image

TG: లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రాభివృద్ధిపై పూర్తిస్థాయి దృష్టి పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈమేరకు ప్రధాని, కేంద్రమంత్రులను కలిసినట్లు ఢిల్లీ పర్యటన సందర్భంగా చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు రాజకీయాలకు అతీతంగా పనిచేస్తామని రేవంత్ స్పష్టం చేశారు.

Similar News

News March 18, 2026

మహిళా ఓటర్ల ఫేవర్ ఎవరికో? (1/2)

image

నాలుగు రాష్ట్రాలు, ఓ యూటీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైన వేళ మరోసారి మహిళా ఓటర్ల డామినేషన్ చర్చనీయాంశమైంది. 2025 బిహార్, ఢిల్లీ ఎన్నికల్లో ఉమెన్ ఫ్యాక్టర్ వర్కౌట్ అయింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా మహిళలను ఆకట్టుకునేందుకు పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. అస్సాంలో 1.25Cr (49.97%), బెంగాల్‌లో 3.16Cr (49%), TNలో 2.89Cr (51.07%), కేరళంలో 1.38Cr (51%), పుదుచ్చేరి 5.3లక్షలు (53%) మహిళా ఓటర్లు ఉన్నారు.

News March 18, 2026

మహిళా ఓటర్ల ఫేవర్ ఎవరికో? (2/2)

image

మహిళలు డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉన్నారు కాబట్టే WBలో మమతా సర్కార్‌‌ ఇచ్చిన లక్ష్మిర్ భండార్ స్కీమ్‌కు కౌంటర్‌గా ₹5700Cr ప్యాకేజ్, అన్నపూర్ణ యోజనతో నెలకు ₹3వేలు ఇస్తామని BJP ప్రకటించింది. TNలో నెలకు ₹2500, ఆడశిశువులకు గోల్డ్ రింగ్ వంటి హామీలొచ్చాయి. కేరళంలో పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అస్సాంలో మహిళా సంఘాలే తమ డిమాండ్స్‌పై మ్యానిఫెస్టో ప్రకటించాయి. మరి మహిళలు గేమ్ ఛేంజర్‌గా మారతారో చూడాలి.

News March 18, 2026

రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు: APSDMA

image

AP: రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని APSDMA వెల్లడించింది. శ్రీకాకుళం, VZM, మన్యం, అల్లూరి, పోలవరం, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, NLR, కర్నూలు, నంద్యాల, ATP, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, TPTYలో పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది.