News April 18, 2025
చైనాతో మంచి డీల్ చేసుకుంటాం: ట్రంప్

వాణిజ్యంపై త్వరలోనే చైనాతో మంచి ఒప్పందం చేసుకుంటామని US అధ్యక్షుడు ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే యూరప్‌తోపాటు ఇతర దేశాలతో డీల్ చేసుకోవడంలో కొంత సమస్య ఉందన్నారు. ఇటాలియన్ ప్రధానమంత్రి వైట్ హౌస్ పర్యటన సందర్భంగా ట్రంప్ మాట్లాడారు. కాగా అమెరికా-చైనా మధ్య ప్రస్తుతం ట్రేడ్ వార్ నడుస్తోంది. డ్రాగన్ వస్తువులపై US ఏకంగా 245శాతం పన్ను విధించిన సంగతి తెలిసిందే.
Similar News
News April 19, 2025
అక్టోబర్‌లో BRS అధ్యక్షుడి ఎన్నిక: KTR

TG: BRS పార్టీ అధ్యక్షుడి ఎన్నిక అక్టోబర్‌లో ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR వెల్లడించారు. HYD నేతలతో సమావేశమైన ఆయన పార్టీ రజతోత్సవ కార్యక్రమాలు, ఈనెల 27న WGLలో జరిగే సభపై దిశానిర్దేశం చేశారు. ఆ సభ తర్వాత కొత్తగా పార్టీ సభ్యత్వాలు తీసుకుంటామని, ఇకపై డిజిటల్ సభ్యత్వాలు తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. అన్ని విషయాలపై అవగాహనతో మాట్లాడగలిగేలా కార్యకర్తలకు త్వరలో శిక్షణ ఇస్తామన్నారు.
News April 19, 2025
OTTలో బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్.. ఈ వీకెండ్ చూసేయండి..

*Officer On Duty- Netflix: తాకట్టులో పెట్టిన దొంగ బంగారంతో కథ మొదలవుతుంది. కుంచాకో బోబన్ దర్యాప్తు.. ఒక సీరియల్ కిల్లర్ గ్యాంగ్ దగ్గరకు చేరుతుంది. ఇన్టెన్స్, యాక్షన్, ఎమోషన్‌తో సాగే ఒక బెస్ట్ క్రైమ్ డ్రామా.
*Dahaad(సిరీస్)- Prime: మిస్సైన అమ్మాయిలు పబ్లిక్ టాయిలెట్‌లో శవాలుగా దొరుకుతుంటారు. ఈ మిస్టరీ ఛేదించేందుకు సోనాక్షి యాక్షన్‌లోకి దిగుతుంది. పోలీసులతో కిల్లర్ ఆడే మైండ్ గేమ్ కట్టిపడేస్తుంది.
News April 19, 2025
RCBకి చిన్నస్వామి స్టేడియమే శాపమా?

18 ఏళ్లుగా IPL టైటిల్ కొట్టాలనే RCB కలలపై సొంత గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం నీళ్లు చల్లుతోంది. బయటి మైదానాల్లో గెలుస్తున్న RCB ఇక్కడ మాత్రం చేతులెత్తేస్తోంది. ఈ స్టేడియం చిన్నగా ఉండటం సొంత జట్టుకన్నా ప్రత్యర్థులకే ఎక్కువగా ఉపయోగపడుతోందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత WPL, IPLలో కలిపి ఇక్కడ 7 మ్యాచులు వరుసగా ఓడడంతో ఈ మైదానం RCBకి అచ్చిరావడం లేదని ఫ్యాన్స్ వాపోతున్నారు.