News July 16, 2024
కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తాం: భట్టి

TG: రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. స్వయం సహాయక సంఘాలకు రూ.480కోట్ల రుణాలను ఆయా బ్యాంకుల ద్వారా ఇప్పించామన్నారు. మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో ఏర్పాటు చేసిన కలెక్టర్ల సదస్సులో ఆయన సీఎం రేవంత్, ఇతర మంత్రులతో కలిసి పాల్గొన్నారు.
Similar News
News February 13, 2026
ఈ సెంటిమెంట్ రిపీటైతే టీ20 వరల్డ్ కప్ ఇండియాదే!

జింబాబ్వే సంచలన విజయం టీమ్ఇండియా అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. 1983 ODI WC, 2007 T20 వరల్డ్ కప్‌లో జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించినప్పుడు భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు T20 వరల్డ్ కప్ మ్యాచ్‌లోనూ జింబాబ్వే ఆసీస్‌ను చిత్తు చేయడంతో ఆ అరుదైన ‘సెంటిమెంట్’ రిపీట్ అవుతుందని గూగుల్ ఇండియా విశ్లేషించింది. ఈ లక్కీ ఫ్యాక్టర్ నిజమైతే SKY సేన కప్పు గెలవడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
News February 13, 2026
ఈ విజయం మా బాధ్యతను పెంచింది: రేవంత్

TG: మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌కు విజయాన్ని కట్టబెట్టారని ప్రజలకు CM రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రెండేళ్ల పాలన, అభివృద్ధి కార్యక్రమాలకు ఈ తీర్పుతో సంపూర్ణ ఆమోదం తెలిపారని ట్వీట్ చేశారు. ఇది తమ బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు. మున్సిపాలిటీలను గొప్పగా అభివృద్ధి చేసి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితం చేస్తున్నామన్నారు.
News February 13, 2026
వైట్ కాలర్ జాబ్స్‌ను AI భర్తీ చేస్తుంది: మైక్రోసాఫ్ట్ AI చీఫ్

రాబోయే 12 నుంచి 18 నెలల్లో కంప్యూటర్ ఆధారిత ‘వైట్ కాలర్’ ఉద్యోగాలను AI భర్తీ చేస్తుందని మైక్రోసాఫ్ట్ AI చీఫ్ ముస్తఫా సులేమాన్ హెచ్చరించారు. ముఖ్యంగా అకౌంటింగ్, మార్కెటింగ్, లీగల్, డేటా ఎంట్రీ వంటి పనులు ఆటోమేషన్ అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఏఐ వల్ల పని వేగం, ఉత్పాదకత పెరిగినప్పటికీ ఉపాధి రంగంలో పెను మార్పులు వస్తాయని ఆయన విశ్లేషించారు. టెకీలు తమ నైపుణ్యాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.


