News April 15, 2024
పశ్చిమ యూపీని ప్రత్యేక రాష్ట్రం చేస్తాం: మాయావతి

ఎన్నికల వేళ యూపీ మాజీ సీఎం, బీఎస్‌పీ చీఫ్ మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తమను గెలిపిస్తే పశ్చిమ యూపీని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడతామన్నారు. ‘బీజేపీ మరోసారి అధికారంలోకి తక్కువ ఛాన్సులు ఉన్నాయి. ఓటింగ్ మెషీన్స్ ట్యాంపర్ కాకుండా, పారదర్శకంగా ఎన్నికలు జరిగితే బీజేపీ గెలవదు. ధనికులను మరింత సంపన్నులుగా తీర్చిదిద్దేందుకే బీజేపీ కృషి చేస్తోంది’ అని విమర్శించారు.
Similar News
News March 11, 2026
వివేకా హత్య కేసు.. సునీత పిటిషన్ల కొట్టివేత

AP: దివంగత ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కూతురు సునీతా రెడ్డికి చుక్కెదురైంది. ఎంపీ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి సహా పలువురి బెయిల్ రద్దు చేయాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే మూడో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేశామని, తదుపరి దర్యాప్తు అవసరం లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. విచారణ త్వరగా పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును SC ఆదేశించింది.
News March 11, 2026
వరల్డ్ కప్ గెలిచాక ట్రైన్‌లో ముంబైకి వెళ్లిన దూబే

ప్రపంచ కప్ గెలిచామన్న సంతోషం ఓ వైపు. ఈ మధుర క్షణాలను పిల్లలతో పంచుకోవాలనే ఆరాటం మరో వైపు. అదే సమయంలో విమాన టికెట్స్ దొరక్కపోవడంతో టీమ్ఇండియా ఆల్ రౌండర్ శివమ్ దూబే తన భార్యతో కలిసి రైలులో థర్డ్ ఏసీ కోచ్‌లో అహ్మదాబాద్ నుంచి ముంబైకి ప్రయాణించారు. ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్, క్యాప్ ధరించి పై బెర్త్‌పై పడుకుని సొంతూరుకు చేరుకున్నారు.
News March 11, 2026
సంచలన తీర్పు.. కారుణ్య మరణానికి సుప్రీం అనుమతి

సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిస్తూ 32 ఏళ్ల హరీశ్ రాణాకు కారుణ్య మరణం (Passive Euthanasia) కింద వైద్య సహాయాన్ని నిలిపివేసేందుకు అనుమతించింది. దేశంలో ఇటువంటి కేసు ఇదే మొదటిది కావడం గమనార్హం. 100% వైకల్యంతో రాణా 12 ఏళ్లుగా కోమాలో ఉన్నారు. ఆయనకు లైఫ్ సపోర్ట్ తొలగించాలని ధర్మాసనం సూచించింది. కోలుకునే అవకాశం లేనప్పుడు గౌరవప్రదంగా మరణించే హక్కు వ్యక్తికి ఉంటుందని కోర్టు వ్యాఖ్యానించింది.


