News July 9, 2024

ఈ గుడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు ఉద్యమిస్తాం: కేటీఆర్

image

TG: డీఎస్సీ అభ్యర్థుల ఆక్రందన కాంగ్రెస్ సర్కారుకు వినపడలేదా అని CM రేవంత్‌ను KTR ప్రశ్నించారు. ‘తొలి కేబినెట్ భేటీలోనే 25 వేల పోస్టులతో మెగా DSC అని మీరిచ్చిన మాట ఏమైంది? మీరు కొలువుదీరితే సరిపోతుందా.. యువతకు కొలువులు అక్కర్లేదా? DSC పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నా ఎందుకీ మొండి వైఖరి? ఈ గుడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు నిరుద్యోగులతో కలిసి మరో ఉద్యమం చేస్తాం’ అని ట్వీట్ చేశారు.

Similar News

News October 15, 2024

క్యాబ్ డ్రైవర్ రాక్స్.. కస్టమర్ షాక్!

image

కస్టమర్ల ప్రవర్తనతో విసిగిపోయిన ఓ క్యాబ్ డ్రైవర్ కారులో ఏర్పాటు చేసిన ఓ పోస్టర్ వైరలవుతోంది. ‘నువ్వు క్యాబ్ ఓనర్ కాదు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఈ క్యాబ్ ఓనర్. కాబట్టి ఆయనతో గౌరవంగా, మర్యాదగా మాట్లాడండి. కారు డోర్‌ను జాగ్రత్తగా క్లోజ్ చేయండి. మీరు మాకు ఎక్కువ డబ్బులు ఇవ్వట్లేదు. మీ యాటిట్యూడ్‌ను మీ జేబులో పెట్టుకోండి. భయ్యా అని పిలవకండి. వేగంగా వెళ్లాలని చెప్పకండి’ అని పోస్టర్‌లో రాసుంది.

News October 15, 2024

సజ్జలపై లుక్ అవుట్ నోటీసు ఉంది: DGP

image

AP: టీడీపీ ప్రధాన కార్యాలయం, గన్నవరం TDP ఆఫీసుపై దాడి కేసుల్ని CIDకి బదిలీ చేశామని DGP ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఓ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డిపై లుక్ అవుట్ నోటీసు ఉందని చెప్పారు. ‘తిరుమలలో కల్తీ నెయ్యి కేసులో స్వతంత్ర దర్యాప్తు కోసమే స్పెషల్ టీమ్‌ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఇందులో ఇద్దరు AP పోలీసులు, ఇద్దరు CBI, ఒక FSSAI అధికారి ఉంటారు. దీంట్లో రాష్ట్ర పోలీసుల జోక్యం ఉండదు’ అని అన్నారు.

News October 15, 2024

దేవర మూవీ మరో రికార్డ్

image

కలెక్షన్లలో ‘దేవర’ మూవీ మరో ఘనత సాధించింది. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి 18రోజుల పాటు కనీసం రూ.కోటి చొప్పున వసూలు చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. కొవిడ్ తర్వాత ఈ స్థాయి కలెక్షన్లు రాబట్టిన సినిమా ఇదే అని పేర్కొన్నాయి. ఇటు సీడెడ్‌లో కలెక్షన్లు రూ.30 కోట్లు దాటాయి. దీంతో ఆ ఏరియాలో రూ.30 కోట్లు దాటిన 2 సినిమాలు ఉన్న వ్యక్తిగా NTR నిలిచారు. ఇప్పటి వరకు ఈ మూవీ రూ.510 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.