News January 15, 2025

ఇందిరా భవన్‌కు కాదు లైబ్రరీకి మన్మోహన్ పేరు పెడతాం: కాంగ్రెస్

image

ఢిల్లీలోని తమ కొత్త హెడాఫీసుకు ఇందిరా భవన్ పేరునే కొనసాగిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ‘సర్దార్ మన్మోహన్ సింగ్ భవన్’గా పేరుమార్చి ఆయన్ను గౌరవించాలని <<15160758>>BJP<<>> అడగటంపై స్పందించింది. ఇందిరా భవన్‌లోని లైబ్రరీకి మన్మోహన్ పేరు పెడతామని ప్రకటించింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కలిసి కొత్త ఆఫీసును బుధవారం ఆరంభించిన సంగతి తెలిసిందే.

Similar News

News December 23, 2025

BHELలో 160 పోస్టులు.. అప్లై చేశారా?

image

భోపాల్‌లోని భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (<>BHEL<<>>)లో 160 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ITI, డిప్లొమా, డిగ్రీ(BE, B.Tech, BBA) అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 27ఏళ్లు. ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.12,300, టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.10,900 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://bpl.bhel.com/

News December 23, 2025

ఇతిహాసాలు క్విజ్ – 105

image

ఈరోజు ప్రశ్న: ఈ చిత్రంలో కనిపిస్తున్న వింత ఆకారానికి కొన్ని పురాణాల ప్రకారం ఓ పేరుంది. ఆ పేరేంటి? ఇది ఎవరి అవతారం?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 23, 2025

100% సబ్సిడీతో ఆయిల్‌పామ్ మొక్కలు

image

ఆంధ్రప్రదేశ్‌లో ఆయిల్‌పామ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలు ఇస్తోంది. 100% సబ్సిడీతో మొక్కలు సరఫరా చేస్తోంది. హెక్టారు(2.47ఎకరాలు)కు దిగుమతి రకం మొక్కలకు రూ.29 వేలు, స్వదేశీ మొక్కలకు రూ.20 వేలు ఇస్తోంది. బోర్‌వెల్‌కు రూ.25 వేలు, మోటారుకు రూ.10 వేలు, పంట రక్షణ కోసం వైర్ మెష్ కంపోనెంట్‌ ఏర్పాటుకు రూ.20 వేలు, పంట కోత సమయంలో విద్యుత్ సమస్యను అధిగమించేందుకు రూ.2,500 అందిస్తోంది.