News December 16, 2024
భారత వ్యతిరేక కార్యకలాపాల్ని మా దేశంలో అనుమతించం: శ్రీలంక

కొన్నేళ్ల క్రితం చైనాకు దగ్గరైన శ్రీలంక ఇప్పుడు మళ్లీ భారత్ చెంత చేరుతోంది. భారత ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ కార్యకలాపాలనూ తమ దేశంలో అనుమతించబోమని న్యూఢిల్లీకి తాజాగా హామీ ఇచ్చింది. తమ అప్పు తీర్చనందుకు శ్రీలంకలోని హంబన్టొటా పోర్టును చైనా స్వాధీనం చేసుకుని అక్కడ నిఘా నౌకల్ని మోహరిస్తోంది. శ్రీలంక తాజా ప్రకటన నేపథ్యంలో చైనాను ఖాళీ చేయాలని కొలంబో కోరే అవకాశం ఉంది.
Similar News
News January 24, 2026
ఢిల్లీ.. ఊపిరి పీల్చుకో!

దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు ఇవాళ కాస్త స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నారు. వర్షాలు, గాలి వేగం పెరగడంతో వాయు కాలుష్యం తగ్గి గాలి నాణ్యత కొద్దిగా మెరుగైంది. సగటున AQI 249 పాయింట్లుగా నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ఎయిర్ క్వాలిటీ క్షీణించడంతో కొన్ని నెలలుగా అక్కడి వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలతో పాటు మంచు కురుస్తోంది.
News January 24, 2026
ఉగ్ర కుట్ర భగ్నం.. 2.5 కిలోల RDX స్వాధీనం!

రిపబ్లిక్ డే లక్ష్యంగా ఉగ్రదాడి కుట్రను పంజాబ్ పోలీసులు భగ్నం చేశారు. హొషియార్పూర్లో నలుగురు బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI) టెర్రరిస్టులను అరెస్టు చేశారు. 2.5 కిలోల RDX, 2 పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. అమెరికాకు చెందిన హ్యాండ్లర్ల ద్వారా ఈ ముఠా ఆపరేట్ అవుతున్నట్లు పోలీసులు తెలిపారు. గణతంత్ర వేడుకల్లో దాడులకు ప్లాన్ చేశారన్న సమాచారంతో సోదాలు చేసినట్లు చెప్పారు.
News January 24, 2026
బడ్జెట్ 2026: పాత పన్ను విధానానికి కాలం చెల్లినట్లేనా?

బడ్జెట్ 2026లో పాత ఆదాయపు పన్ను విధానాన్ని రద్దు చేస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే 72% మంది ట్యాక్స్ పేయర్స్ కొత్త విధానానికే మొగ్గు చూపుతున్నారు. పాత దాంట్లో పెట్టుబడుల లెక్కలు చూపడం, తనిఖీలు, నోటీసులు ఎదుర్కోవడం కష్టమవుతుండటంతో.. ప్రభుత్వం దీన్ని రద్దు చేయొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఒక్కసారిగా కాకుండా కొంత గడువు ఇచ్చి తీసేయొచ్చని భావిస్తున్నారు.


