News March 17, 2025
భాషపై లేనిపోని రాజకీయాలు చేయం: CBN

AP: భాష కమ్యూనికేషన్ కోసమే అని, దాంతో విజ్ఞానం రాదని CM చంద్రబాబు అన్నారు. ‘మాతృభాషతోనే విజ్ఞానం వస్తుంది. భాషపై లేనిపోని రాజకీయాలు చేయం. బతుకుదెరువుకు ఎన్ని భాషలైనా నేర్చుకుంటాం. కానీ మాతృభాషను మరిచిపోకూడదు’ అని తెలిపారు. మరోవైపు, ధ్వంసమైన రాష్ట్రాన్ని ట్రాక్లో పెట్టామన్నారు. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. రాయలసీమను రతనాలసీమగా మార్చడం ఖాయమని వివరించారు.
Similar News
News December 4, 2025
తిరుపతి: విద్యార్థులు.. విజ్ఞాన.. విహార యాత్రలు

పీఎం శ్రీ పాఠశాల విద్యార్థులకు విజ్ఞాన.. విహార యాత్రల నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 44 పాఠశాల్లోని 8, 9 తరగతి విద్యార్థులు 6809 మందిని తీసుకెళ్తున్నారు. ఈనెల 10వ తేదీ లోపు శ్రీహరికోట, జూపార్క్, రీజనల్ సైన్స్ సెంటర్, చంద్రగిరి కోట ప్రదేశాలకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు తయారు చేశారు. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒక్కో విద్యార్థికి రూ.500 కేటాయించింది.
News December 4, 2025
పంచాయితీ చిచ్చు.. కుటుంబాలు ఛిన్నాభిన్నం

‘రూపాయి రూపాయి.. నువ్వు ఏం చేస్తావంటే హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తాను అని చెప్పిందట’ ఇది ఆ నలుగురు సినిమాలోని డైలాగ్. ఇప్పుడు రాజకీయమా నువ్వు ఏం చేస్తావంటే.. <<18468452>>తల్లీకూతుళ్లు<<>>, అన్నాచెల్లెళ్లు, తండ్రీకొడుకులు, బావ బావమరుదుల మధ్య చిచ్చు పెడతానని చెబుతుంది. TG పంచాయతీ ఎన్నికల్లో కనిపిస్తోన్న దృశ్యమిది. పార్టీలు, నాయకుల పంతాలతో సామాన్య కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. ఈ ప్రమాదకర ధోరణిపై మీ కామెంట్
News December 4, 2025
BREAKING: సెలవుల జాబితా ప్రకటించిన ప్రభుత్వం

AP: 2026కు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల జాబితాను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 24 జనరల్ హాలిడేస్, 21 ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయి. జనరల్ సెలవుల్లో మహాశివరాత్రి(ఫిబ్రవరి 15), బాబు జగ్జీవన్ రామ్ జయంతి(ఏప్రిల్ 5), దుర్గాష్టమి(అక్టోబర్ 18), దీపావళి(నవంబర్ 8) ఆదివారం వచ్చాయి. పైన ఫొటోల్లో సెలవుల లిస్టును చూడొచ్చు. వీటిని బట్టి మీ ట్రిప్స్ను ప్లాన్ చేసుకోండి.


