News December 20, 2024
తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించం: టీటీడీ ఛైర్మన్

తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని TTD ఛైర్మన్ BR నాయుడు హెచ్చరించారు. ‘తిరుమల రాజకీయ వేదిక కాదు. తెలంగాణకు చెందిన ఒక నేత తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. అతనిపై చర్యలకు ఆదేశిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు. తిరుమలలో TG భక్తులపై వివక్ష చూపుతున్నారని <<14920837>>BRS నేత శ్రీనివాస్ గౌడ్<<>> ఆరోపించిన సంగతి తెలిసిందే.
Similar News
News November 24, 2025
టికెట్ ధరల పెంపు.. తప్పుగా తీసుకోవద్దు: మైత్రీ రవి

టికెట్ ధరల పెంపుపై మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మేము ఇండస్ట్రీ వృద్ధి కోసమే డబ్బును ఖర్చు చేస్తున్నాం. ఈ కారణంతో 6-7 సినిమాలకు టికెట్ ధరలు పెంచుతున్నాం. ఆ పెంపు రూ.100 మాత్రమే. ఈ అంశాన్ని తప్పుగా తీసుకోవద్దు’ అని చెప్పారు. కాగా టికెట్ ధరల పెంపుపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే.
News November 24, 2025
బీజేపీ ‘మిషన్ బెంగాల్’.. టార్గెట్ 160

బిహార్‌లో భారీ విజయం సాధించిన BJP ఫోకస్‌ను బెంగాల్ వైపు మళ్లించింది. 2026 ఎన్నికల్లో 160+ సీట్లే లక్ష్యంగా వ్యూహం రచిస్తోంది. TMCకి క్షేత్రస్థాయి కార్యకర్తల సపోర్ట్‌ను బ్రేక్ చేయాలని, మమత అల్లుడు అభిషేక్ బెనర్జీని వ్యతిరేకించే వారిని తమవైపు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తోంది. వారసత్వ రాజకీయం, అక్రమ ఓట్లపై టార్గెట్ చేయాలని చూస్తోంది. హిందూ ఓట్లు పోలరైజ్ చేయాలని నిర్ణయించినట్లు పార్టీవర్గాలు చెప్పాయి.
News November 24, 2025
స్మృతి పెళ్లి వాయిదా.. పలాశ్ సోదరి రిక్వెస్ట్!

టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి వాయిదా పడేందుకు వాళ్ల ఫాదర్ ఆరోగ్య పరిస్థితి కారణమని పలాశ్ ముచ్చల్ సోదరి పాలక్ ముచ్చల్ తెలిపారు. ఈ విపత్కర పరిస్థితిలో తమ కుటుంబాల గోప్యతకు గౌరవం ఇవ్వాలని ఆమె కోరారు. నిన్న ఉదయం స్మృతి తండ్రి శ్రీనివాస్‌కు హార్ట్ ఎటాక్ రావడంతో పెళ్లి వాయిదా పడినట్లు మేనేజర్ తుహిన్ మిశ్రా ప్రకటించిన సంగతి తెలిసిందే.


