News February 9, 2025

క్రమశిక్షణ తప్పినవారిని ఉపేక్షించం: తుమ్మల

image

TG: కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ తప్పినవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కష్టపడే కార్యకర్తలకే పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ఖమ్మంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఎన్నికల్లో ప్రజామోదం ఉన్న నేతలకే అవకాశం ఇవ్వాలి. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News September 19, 2025

పొంగులేటి బయోపిక్.. హీరోగా సుమన్

image

TG: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జీవిత చరిత్ర తెరకెక్కనుంది. ‘శ్రీనన్న అందరివాడు’ అనే టైటిల్‌తో రూపుదిద్దుకునే ఈ మూవీలో పొంగులేటి వ్యక్తిగత, రాజకీయ జీవితాన్ని చూపించనున్నారు. సీనియర్ నటుడు సుమన్.. పొంగులేటి పాత్రను పోషిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. బయ్యా వెంకట నర్సింహ రాజ్ దీనికి డైరెక్టర్, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాసర్ల శ్యాం పాటలు రాస్తున్నారు.

News September 19, 2025

టీడీపీలోకి మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్

image

AP: మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఆయనతో పాటు చిలకలూరిపేటకు చెందిన పలువురు వైసీపీ నేతలు టీడీపీ కండువా కప్పుకోనున్నారు. మాజీ మంత్రి విడదల రజినితో విభేదాల కారణంగా ఇప్పటికే ఆయన వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. గతంలో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజశేఖర్ వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్‌గానూ పనిచేశారు.

News September 19, 2025

బొప్పాయిలో రింగ్ స్పాట్ వైరస్ – లక్షణాలు

image

రింగ్ స్పాట్ వైరస్ సోకిన బొప్పాయి చెట్ల లేత ఆకులు పసుపు పచ్చగా మారతాయి. ఆకుల ఈనెలు వంగి ముడుచుకుపోతాయి. పూత, పిందె, కాయ, పండ్లపై గోధుమ రంగులో ఉంగరాల్లాంటి రింగుల మచ్చలు ఏర్పడతాయి. ఆ రింగు మధ్య బాగం ఆకుపచ్చగా ఉంటుంది. తెగులు సోకిన పూలు.. పిందెగా మారవు. పిందెలు ఎదగవు. కాయలు తొందరగా పండిపోయి మెత్తగా మారి నీరు కారినట్లు అవుతాయి. ఈ మచ్చల వల్ల పండ్లు నాణ్యత కోల్పోయి మార్కెట్‌లో పంటకు సరైన ధర దక్కదు.