News September 22, 2024

బాలినేని ఏ పార్టీలోకి వెళ్లినా వదలం: టీడీపీ ఎమ్మెల్యే

image

AP: వైసీపీ మాజీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాను సర్వనాశనం చేశారని ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆరోపించారు. ఆయన ఏ పార్టీలోకి వెళ్లినా కేసుల నుంచి తప్పించుకోలేరని తేల్చిచెప్పారు. ‘వైసీపీ హయాంలో నాపై 32 అక్రమ కేసులు పెట్టించారు. చంద్రబాబును కూడా బాలినేని దూషించారు. టీడీపీ కార్యకర్తలను వేధించారు. ఇప్పుడు జనసేనలో చేరకముందే బెదిరింపులకు పాల్పడుతున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

Similar News

News November 21, 2025

NCCDలో ఉద్యోగాలు

image

నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్‌చైన్ డెవలప్‌మెంట్‌ (NCCD) 5 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 8వరకు అప్లై చేసుకోవచ్చు. contact-nccd@gov.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి బీఈ, బీటెక్, పీజీ(అగ్రి బిజినెస్), ఎంకామ్, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: nccd.gov.in.

News November 21, 2025

రాజధాని రైతులకు ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తాం: నారాయణ

image

AP: రాజధానిలో రైతులకిచ్చిన ప్లాట్‌లలో మౌలిక వసతుల కల్పన వేగంగా జరుగుతోందని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలోని పలు గ్రామాల్లో పర్యటించి మాట్లాడారు. ‘69,421 మంది రైతులకు 61,433 ప్లాట్‌ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. 991మంది రైతులకే ప్లాట్‌లు కేటాయించాల్సి ఉంది. కొందరు తమకు కావాల్సిన చోట ప్లాట్లు అడుగుతున్నారు. రాజధాని రైతులకు అన్యాయం జరగదు. ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తాం’ అని మంత్రి స్పష్టం చేశారు.

News November 21, 2025

పిల్లలకు నెబ్యులైజర్ ఎక్కువగా వాడుతున్నారా?

image

పిల్లల నెబ్యులైజర్‌లో ఉపయోగించే మందులు సాధారణంగా స్టెరాయిడ్స్ కలిగి ఉంటాయి. వీటి వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయంటున్నారు నిపుణులు. ఈ మందులను డాక్టర్ సలహా లేకుండా వాడకూడదని సూచిస్తున్నారు. దీన్ని ఎక్కువగా వాడితే వాంతులు, అశాంతి, నిద్రలేమి వంటి సమస్యలు వచ్చే అవకాశముంది. నెబ్యులైజర్ పైపును సరిగ్గా క్లీన్ చెయ్యకపోతే బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్లు/ న్యుమోనియా వచ్చే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.