News September 2, 2025
ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం: రాహుల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిహార్‌లో చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర ముగిసింది. ఈ సందర్భంగా వచ్చే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వమని ప్రతిజ్ఞ చేశారు. తమ శక్తి మేరకు ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని రక్షిస్తామన్నారు. ‘యాత్రను చరిత్రాత్మకంగా మార్చిన ఇండీ కూటమి నేతలు లాలూ ప్రసాద్, తేజస్వీ, దీపాంకర్, ముకేశ్ సాహ్ని, కాంగ్రెస్ శ్రేణులు, రాష్ట్ర యువతకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News February 5, 2026
రేపు ఆర్బీఐ రెపో రేటు ప్రకటన

RBI రేపు ప్రకటించనున్న రెపో రేటు కోసం మార్కెట్ వర్గాలు ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన మంగళవారం ప్రారంభమైన MPC భేటీ (మానిటరీ పాలసీ కమిటీ) శుక్రవారం తన నిర్ణయాలను ప్రకటించనుంది. GDP వృద్ధి రేటు జోరు మీద ఉన్న నేపథ్యంలో ఆర్‌బీఐ ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. రెపో రేటు తగ్గితే సామాన్యుడికి లాభం కలుగుతుంది. ఇల్లు, వాహనం, పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేట్లు తగ్గుతాయి.
News February 5, 2026
AI ఎఫెక్ట్.. ఉద్యోగం కోల్పోయిన శశిథరూర్ కుమారుడు

అమెరికా మీడియా సంస్థ ‘వాషింగ్టన్ పోస్ట్’ తమ సిబ్బందిలో మూడింట ఒక వంతు మందిని (300+) ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇందులో కాంగ్రెస్ MP శశిథరూర్ తనయుడు ఇషాన్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన SMలో వెల్లడించారు. ‘నాతో పాటు చాలా మంది ఇంటర్నేషనల్ స్టాఫ్‌ను తొలగించారు. మా ఖాళీ న్యూస్ రూమ్‌ను, జర్నలిస్టులను చూస్తుంటే బాధగా ఉంది’ అని పేర్కొన్నారు. AI వల్ల ITతో పాటు ఇతర రంగాల్లో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి.
News February 5, 2026
బంధంలో ఇది ముఖ్యం

అన్యోన్యంగా జీవితాన్ని సాగించాలనుకునే దంపతులు పట్టు విడుపులు సమానంగా పాటించాలి. అంతేగానీ బంధాన్ని నిలబెట్టుకోవాలన్న తాపత్రయంతోనో, నలుగురూ వేలెత్తి చూపుతారన్న భయంతోనో నిరంతరం అవతలి వారి తప్పులను క్షమిస్తూ పోతే మీ జీవితాన్ని మీరే పాడుచేసుకున్న వారవుతారు. కాబట్టి బంధమేదైనా అన్ని రకాలుగా బ్యాలన్స్‌డ్‌గా ఉంటేనే కలకాలం నిలుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.


